అర్జున్ ఓపెన్ చేశాడు
- IndiaGlitz, [Thursday,July 04 2019]
ఇంటర్నెట్‌లో సీజన్‌కు తగ్గట్టుగా ఏదో ఒక చాలెంజ్ నడుస్తూనే ఉంటుంది. ఐస్ బకెట్ అనీ, రైస్ బకెట్ అనీ... ఇలా ఏదో ఒక చాలెంజ్ నడుస్తూనే ఉంటుంది. తాజాగా కాలితో బాటిల్ మూత తెరిచే చాలెంజ్ జరుగుతోంది. చేత్తో కాకుండా కాలితోనే బాటిల్ తెరవడం దీని ప్రత్యేకత. అయితే ఈ క్రమంలో బాటిల్ పగలకూడదు. ఈ చాలెంజ్ ఇప్పటిదాకా హాలీవుడ్, బాలీవుడ్ వాళ్లే చేశారు. మన దగ్గర మాత్రం అర్జున్ తొలిసారిగా చేశారు.
కజకిస్తాన్‌కు చెందిన మిక్స్డ్ మార్షల్ ఆర్టిస్ట్ కరో పషిక్యాన్ ముందు ఈ చాలెంజ్ వీడియో అప్‌లోడ్ చేశారు. జేసన్ స్టాథమ్ దీన్ని కంటిన్యూ చేశారు. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ ఈ చాలెంజ్ స్వీకరించి నెగ్గారు. తాజాగా అర్జున్ చేశారు. ఈ దృశ్యాన్ని ఆయన కుమార్తె ఐశ్వర్య షూట్ చేసి నెట్టింట్లో పెట్టారు. అన్నట్టు అర్జున్ ప్రస్తుతం శివకార్తికేయన్ నటిస్తున్న హీరోలో విలన్‌గా నటిస్తున్నారు.
View this post on Instagram@arjunsarjaa ACTION KING FOR A REASON ?? #BottleCapChallenge #ActionKing @jasonstatham
A post shared by Aishwarya Arjun (@aishwaryaarjun) on Jul 3, 2019 at 12:28am PDT