వినాయక చవితికి రిలీజ్ కానున్న'కురుక్షేత్రం'
Send us your feedback to audioarticles@vaarta.com
యాక్షన్ కింగ్ అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు అర్జున్. వెండితెరపై మార్షల్ ఆర్ట్స్ కు మంచి గుర్తింపు తెచ్చిన అర్జున్.. ఇమేజ్ నే ఇంటిపేరుగా మార్చుకుని యాక్షన్ కింగ్ గా మారాడు. యాక్షన్ హీరోగా దక్షిణాది ప్రేక్షకులందరికీ సుపరిచుతుడైన అర్జున్.. ఇప్పుడు తన కెరీర్ లో అత్యంత అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఆ తరం హీరోలంతా రిటైర్ అవుతోన్న వేళ తను ఏకంగా హీరోగా 150వ సినిమా చేశాడు. అదే కురుక్షేత్రం.
అర్జున్ ఇమేజ్ కు అనుగుణంగా.. అత్యంత స్టైలిస్డ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఈ వినాయక చవితి సందర్భంగా విడుదల చేయబోతున్నారు.తమిళంలో ‘‘నిబునన్’’ పేరు తో రిలీజై మంచి పేరుతో పాటు కమర్షియల్ కూడా మంచి వసూళ్లు రాబట్టిన ఈ మూవీ అత్యంత స్టైలిష్ గా తెరకెక్కించాడు దర్శకుడు అరుణ్ వైద్యనాథన్. ప్యాషన్ స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ను శ్రీ వాడపల్లి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద శ్రీనివాస్ మీసాల తెలుగులో ఈ వినాయక చవితి సందర్భంగా రిలీజ్ చేయనున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ తో పాటు ఈ మూవీలో ఇంకా సుమన్, సుహాసిని, ప్రసన్న, వైభవ్, శ్రుతి హరిహరన్ ఇతర పాత్రల్లో నటించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com