అర్జున్ ఎలిమినేషన్.. ‘‘ బిగ్‌బాస్‌కి వచ్చిందే ఆమె కోసం ’’, కంటతడి పెట్టిన శ్రీసత్య
Send us your feedback to audioarticles@vaarta.com
దివ్వెల పండుగ దీపావళి సెలబ్రేషన్స్‌తో బిగ్‌బాస్ హౌస్ కళకళలాడింది. సెలబ్రిటీల ఆట పాటలతో ఆడియన్స్‌కి ఫుల్ మీల్స్ అందింది. ఆదివారం కావడంతో కింగ్ నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. తర్వాత కంటెస్టెంట్స్‌ని ఏడు జంటలుగా విడగొట్టాడు నాగ్. ఫైమా- రేవంత్, శ్రీసత్య - సూర్య, మెరీనా - రోహిత్, వాసంతి - అర్జున్, ఇనయా - శ్రీహాన్, కీర్తి - రాజ్, గీతూ - ఆదిరెడ్డిలు కలిసి ఆడారు. ఇక తన ఓటీటీ సిరీస్ ఝాన్సీ ప్రమోషన్స్‌లో భాగంగా అంజలి బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేసింది. తర్వాత హైపర్ ఆది రంగంలోకి దిగి.. తనదైన పంచ్‌లు, ప్రాసలతో హౌస్‌మేట్స్‌ని ఆడుకున్నాడు. ఆది విసిరిన తారాజువ్వల్లాంటి కామెడీ పంచ్‌లకు ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకున్నారు. ఆ కాసేపటికే మన చిన్నారి పెళ్లి కూతురు అవికాగోర్ స్టెప్పులు వేసి అలరించారు. ఆమె ఇలా వెళ్లగానే సర్దార్ చిత్ర యూనిట్ ఎంట్రీ ఇచ్చింది. హీరో కార్తీ, దర్శకుడు మిత్రన్, హీరోయిన్ రజీషా స్టేజ్‌పై సందడి చేశారు.
అనంతరం నామినేషన్స్‌లో వున్న 13 మందిలో ఒక్కొక్కరిని సేఫ్ చేస్తూ వచ్చాడు నాగ్. ముందుగా రేవంత్ , శ్రీహాన్, ఆదిరెడ్డి, రాజ్, ఫైమా, కీర్తి, శ్రీసత్య, రోహిత్, ఇనయా, మెరీనాలు సేఫ్ అయ్యారు. చివరికి వాసంతి, అర్జున్ కళ్యాణ్‌లు నిలవగా... వీరిద్దరిలో అర్జున్ ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించారు నాగ్. దీంతో ఇంటి సభ్యులంతా షాక్‌కు గురయ్యారు. ముఖ్యంగా శ్రీసత్య కంటతడి పెట్టుకుంది. మన గలాటా పాప గీతూ.. ఆమెను ఓదారుస్తూ ‘‘ఎవరి కోసం ఏడవనని అన్నావ్ ఎందుకు ఏడుస్తున్నావ్’’ అని ప్రశ్నించింది. శ్రీహాన్, రేవంత్ కూడా ఎమోషనల్ అయ్యారు.
అనంతరం స్టేజ్ పైకి వచ్చిన అర్జున్ కళ్యాణ్‌కు తన జర్నీని చూపించారు నాగార్జున. తర్వాత హౌస్‌లో ఎవరు ఆటం బాంబ్, ఎవరు తుస్ అన్నది చెప్పాలంటూ టాస్క్ ఇచ్చాడు. దీనికి అర్జున్, శ్రీహాన్, శ్రీసత్య, రేవంత్, గీతూ, ఫైమాలను ఆటం బాంబ్స్ అని.. రోహిత్, మెరీనా, కీర్తి, ఇనయా, బాలాదిత్యలకు తుస్ అని చెప్పాడు. ఇక వెళ్తూ.. వెళ్తూ... అర్జున్ ఒక సీక్రెట్ చెప్పాడు. అసలు తాను బిగ్‌బాస్ షోకు రావడానికి ప్రధాన కారణం శ్రీసత్యనే అన్నాడు. ఒక సినిమాలో ఛాన్స్ వుందని తాను శ్రీసత్యకు చెప్పానని.. అయితే తాను బిగ్‌బాస్‌కు వెళ్తున్నానని శ్రీసత్య చెప్పిందని, దీంతో తాను కూడా బిగ్‌బాస్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు బ్రేకింగ్ న్యూస్ చెప్పాడు. ఈ విషయం శ్రీసత్యకు కూడా తెలియదని.. స్టేజ్ మీదే చెప్పాలని ఇప్పటి వరకు మనసులోనే దాచుకున్నట్లు తెలిపాడు. బిగ్‌బాస్ ఆఫర్ రాగానే ముందు శ్రీసత్యకే చెప్పానని.. తన ఇంట్లో వాళ్లకు కూడా చెప్పలేదని పేర్కొన్నాడు. దీంతో అంతా షాక్ అయ్యారు. ఈ మాటలతో చాలా స్ట్రాంగ్‌గా వుండే శ్రీసత్య కూడా బాగా ఎమోషనల్ అయ్యింది. అర్జున్ వంక అలా చూస్తూనే వుండిపోయింది.
ఇకపోతే.. గడిచిన కొన్ని వారాలుగా చప్పగా సాగుతోన్న బిగ్‌బాస్ ఈ వారం కాస్త ఊపొచ్చినట్లుగా కనిపిస్తోంది. బిగ్‌బాస్ స్వయంగా గడ్డిపెట్టడం.. కంటెస్టెంట్స్ ఆట కూడా తానే ఆడటంతో తెలియని జోష్ కనిపిస్తుంది. దీపావళి సెలబ్రేషన్స్ కూడా తోడవ్వడంతో ఈ వారం బిగ్‌బాస్‌కి మంచి టీఆర్పీలే వచ్చే అవకాశం కనిపిస్తోంది. అర్జున్ కళ్యాణ్ ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్‌లో 15 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇప్పటి వరకు షానీ, అభినయశ్రీ, నేహా చౌదరి, ఆరోహి, చలాకీ చంటీ, సుదీప ఎలిమినేట్ అయ్యారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments