మ‌హేష్ బాబు అర్జున్ కి 12 ఏళ్లు..!

  • IndiaGlitz, [Thursday,August 18 2016]

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - గుణ‌శేఖ‌ర్ కాంబినేష‌న్లో రూపొందిన చిత్రం అర్జున్. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న శ్రియ న‌టించింది. అన్నా చెల్లెల అనుబంధం క‌ధాంశంగా రూపొందిన ఈ చిత్రంలో మ‌హేష్ కి చెల్లెలుగా కీర్తి రెడ్డి న‌టించింది. కృష్ణా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై తొలి ప్ర‌య‌త్నంగా మ‌హేష్ బాబు సోద‌రుడు ర‌మేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.

అన్నాచెల్లెల అనుబంధాన్ని తెర పై ఆవిష్క‌రించిన అర్జున్ చిత్రం అన్నాచెల్లెల పండుగ అయిన రాఖీ పండుగ‌కు 12 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకోవ‌డం విశేషం. కృష్ణా ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై రూపొందిన తొలి చిత్రం అర్జున్ ముఖ్య కేంద్రాల్లో 100 రోజులు విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మై మ‌హేష్ కెరీర్ లో ఓ విభిన్న క‌థా చిత్రంగా నిలిచింది..!