'కిల్లర్' విజయం అరుదైనది - అర్జున్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆండ్య్రూ లూయిస్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని, యాక్షన్‌కింగ్ అర్జున్ కలిసి నటిస్తున్న చిత్రం 'కొలైగారన్'.. దియా మూవీస్ బ్యానర్ తమిళంలో నిర్మించిన ఈ సినిమాని పారిజాత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై టి.నరేష్‌కుమార్–టి.శ్రీధర్ ‘కిల్లర్’ పేరుతో టి.అంజయ్య సమర్పణలో తెలుగులో విడుదల చేశారు.. అషిమా కథానాయిక గా నటించింది. రంజాన్ కానుకగా జూన్ 7 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తొలివారంలొనె నిర్మాతలకు మూడు రెట్లు లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సందర్బంగా కిల్లర్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు.
అర్జున్ మాట్లాడుతూ.. కిల్లర్ చాలా బాగా ఆడుతోంది. ఇప్పుడు సినిమా హిట్ అవ్వటం అరుదైపొయింది. ఈ సందర్బంగా నన్ను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చెసిన కొడి రామకృష్ణ గారికి కృతజ్ఞతలు. 35 సం.లుగా నా సినిమాలను ఆదరిస్తున్నారు తెలుగువారు. ఈ చిత్ర దర్శకుడు ఆండ్రూ కు సక్సెస్ క్రెడిట్ ఎక్కువగా ఇవ్వాలి. సినిమా చూసి అందరు పాజిటివ్ గా రాశారు, మాట్లాడారు. విజయ్ ఆంథొని వల్ల ఈ సినిమా చేసాను. టెక్నికల్ వర్క్ ఈ సినిమాకు హైలెట్.ఇదొక రియల్ సక్సెస్. డబ్బు తో పాటు అప్రిషియెషన్స్ రావటం గర్వంగా ఉంది. రెండొ వారంలో 60 థియేటర్స్ పెరగటం చిత్ర ఘన విజయానికి సంకేతం. సమర్పకులు అంజయ్య గారికి దన్యవాదాలు. టీమ్ కు కంగ్రాట్స్ చెప్తునానన్నారు.
హీరోయిన్ అషిమా మాట్లాడుతూ.. కిల్లర్ లాంటి సక్సెస్ఫుల్ సినిమా లో నటించినందుకు ఆనందంగా ఉంది. రివ్యూస్ లొ సినిమాతో పాటు , నా పాత్ర కు ,నటనకు ప్రశంసలు లబించాయన్నారు. విజయ్ ఆంథోని వల్లే ప్రతిభను గుర్తించి ఈ అవకాశాన్ని ఇచ్చారు. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం సక్సెస్ రూపంలో రావటం సంతోషంగా ఉందన్నారు.
బాషా శ్రీ మాట్లాడుతూ.. కిల్లర్ కు ఎక్కడ నెగిటివ్ రివ్యూ లేదు. అందరు సినిమా చూడగానే బావుందని చెప్పారు. అర్జున్ కేవలం నాలుగు గంటల్లో తెలుగు డబ్బింగ్ చెప్పారు. విజయ్ ఆంథోని ,దర్శకుడు ఆండ్రూ కలిసి కిల్లర్ సక్సెస్ కావటంతో కీలకపాత్ర పోషించారు.
దర్శకుడు ఆండ్రూ మాట్లాడుతూ.. కిల్లర్ సక్సెస్ అవ్వటంలోమా టీమ్ కీలకం. విజయ్ ఆంథోని వల్లే ఈ సినిమా అవకాశం వచ్చింది. అర్జున్ గారు నటించటం మా సినిమాకు హైలెట్ అన్నారు.
విజయ్ ఆంథోని మాట్లాడుతూ.. కిల్లర్ లో అర్జున్ గారు చెయటం మాకు ప్రదాన బలం. ఆయనను చూసి, వ్యక్తిగతంగా నటుడు గా ఎంతో నెర్చుకున్నాను. మంచి సినిమాకు తెలుగు వారి ఆదరణ ఉంటుందని కిల్లర్ తో మరొసారి నిరూపితమైంది. ఆషిమా ఈ సినిమాతో నటిగా మంచి గుర్తింపు సాధించింది. ఆండ్రూ దర్శకుడిగా పెద్ద స్థాయికి రీచ్ అవుతాడు. ఇలానే మానుంచి సినిమాలు మరిన్ని రావటానికి కృషి చెస్తామన్నారు.
క్రాంతి మాట్లాడుతూ.. కిల్లర్ మూవీ సక్సెస్ అవ్వడం సంతోషంగా ఉంది. అర్జున్ గారు ఈ చిత్ర తరహా లొనె మరిన్ని మంచి పాత్రలు ఆయన చెయాలని ఆశిస్తున్నానన్నారు
ఈ కార్యక్రమం లో ఇంకా సంగీత దర్శకుడు సైమన్ కింగ్ , సమర్పకులు అంజయ్య ,నిర్మాత ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com