'ఆటా' లో అరిజోన రాష్ట్రం ఫీనిక్స్ చాప్టర్ ప్రారంభం
Send us your feedback to audioarticles@vaarta.com
అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు నూతనంగా ఫీనిక్స్, అరిజోన, టీం ఆరంభించారు. జూన్ 5వ తారీఖున అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో దాదాపు 400 పైగా తెలుగు వారు పాల్గొన్నారు.
ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మరియు సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఈ కార్యక్రంలో చిన్నారులు, పెద్దలు ఎంతో ఉత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు, పాటల పోటీలు మరియు నృత్య పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విజేతలకు బహుమతులు అందచేశారు.
ఆటా ప్రెసిడెంట్ భువనేశ్ బుజాల మాట్లడుతూ 100 మందికి పైగా కొత్త సభ్యులు చేరటం ఎంతో సంతోషంగా వుంది అని ఫీనిక్స్ లోకల్ టీం సేవలు కొనియాడారు. విజేతలకు బహుమతులు అందచేశారు. రఘు గాడి, రీజినల్ కోఆర్డినేటర్, శేషిరెడ్డి గాదె కో-చైర్ అట స్పోర్ట్స్, వంశీ ఏరువారం ర్.సి., చెన్నయ్య మద్దూరి ర్.సి., బిందా కిరణ్ ఈవెంట్ కోఆర్డినేటర్ కొత్తగా మెంబెర్స్ చేర్పించటంలో ఎంతో తోడ్పాటుని అందించారు.
వ్యాఖ్యాతలుగా నివేదిత గాడి, భార్గవి మహీధర్, కిరణ్మయి జ్యోతుల & నీరజ వ్యవరించారు. ఆటా సెక్రటరీ హరి ప్రసాద్ రెడ్డి లింగాల మాట్లాడుతూ భవిష్యత్తులో ఈ టీం మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలి అని ఆకాంక్షించారు, ఆర్గనైజింగ్ టీం సభ్యులు శిల్ప పెనెత్స, రేఖ రెడ్డి ,మదన్ గోపాల్ బొల్లారెడ్డి, ఋక్కు మిల, అనుదీప్ యాపల, సుదర్శన్ మాచుపల్లి, ప్రసాద్ తాటికొండ, ప్రశాంత్ గంగవల్లి & విజయ్ కందుకూరి తదితరులుని అభినందించారు.
కాన్ఫరెన్స్ వివరాలు...
అమెరికా తెలుగు సంఘం(ఆటా) 17వ మహాసభలు అందరి తెలుగు వారి పండుగ కావున అమెరికా రాజధాని నగరం నడిబొడ్డున వాషింగ్టన్ డి సి లో మూడు రోజుల పాటు మహాసభలకు 15,000 పైగా హాజరయ్యే విధంగా న భూతో న భవిష్యతి లాగా నిర్వహించటానికి పద్మవిభూషణ్ సద్గురు, పద్మవిభూషణ్ మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా, కమలేష్ D.పటేల్, విజయ్ దేవరకొండ, డిజె టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్,సంగీత దర్శకుడు తమన్, రామ్ మిర్యాల, మంగ్లీ, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, క్రిస్ గేల్ ,GMR,ఉపాసన కొణిదెల, Dr.MSN Reddy,ప్రముఖ కవులు, కళాకారులు,సినీ ప్రముఖులు, మరియు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది రాజకీయ నాయకులు విచ్చేస్తున్న ఈ మహాసభలకు అమెరికా లో వున్న తెలుగువారందరూ హాజరై భారీ స్థాయిలో విజయవంతం చేయాలని June 15,2022 వరకు 50% off Early Bird discounted price ఇవ్వటం జరుగుతుంది.
Visit : www.ataconference.org/buy-tickets
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments