అరియానా విశ్వరూపం.. టూమచ్
Send us your feedback to audioarticles@vaarta.com
షో స్టార్టింగే.. రూలర్ అయిన అరియానా.. ఒక్కొక్క వస్తువును తీసుకొచ్చి వాటితో తమ అనుబంధాన్ని పంచుకోవాలని చెప్పింది. దీంతో సొహైల్.. ఒక్కొక్కరికి ఒక్కో వస్తువును ఇస్తూ వారితో అనుబంధాన్ని తెలిపాడు. అఖిల్ గురించి చెబుతుంటే.. తను మాత్రం తల దించుకునే ఉన్నాడు. సారీ చెప్పి హగ్ చేసుకున్నాడు. తరువాత మోనాల్ క్వీన్ అయింది. అఖిల్ దగ్గరకు వెళ్లి తన గురించి ఒక గుడ్ అండ్ బ్యాడ్ చెప్పమంది. నిన్ను హేట్ చేసే వారితో కూడా చక్కగా మాట్లాడటానికి ట్రై చేస్తావని చెప్పాడు. బ్యాడ్ వచ్చేసి ఆనందంలో ఉన్నప్పుడు వెనుకా ముందు చూడకుండా ప్రామిస్ చేసేస్తావు అని చెప్పాడు. సొహైల్, అభితో ఓ టాస్క్ చేయించింది. అభి అమ్మాయి.. సొహైల్ అబ్బాయి. అభి ఫ్లర్ట్ చేసి సొహైల్‌ను పార్టీకి తీసుకెళ్లాలి. ఆ టాస్క్‌లో అభి టోన్ మార్చి అమ్మాయిలా చక్కగా మాట్లాడాడు. మధ్యలో అరియానా, హారిక చేరి టాస్క్‌ను బాగా ఫన్నీ వేలో నడిపించారు. తరువాత ఎలా ఉందని మోనాల్.. అఖిల్‌ని అడిగింది. చాలా బాగుంది. అందరం బాగా ఎంజాయ్ చేశామని చెప్పాడు.
తరువాత గోల్డ్ మైక్ ద్వారా ప్రేక్షకులకు అప్పీల్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. రూలర్స్ నుంచి బెస్ట్ రూలర్‌ని ఎంపిక చేయాలని చెప్పగా.. మెజారిటీ హౌస్‌మేట్స్ అరియానాను ఎంచుకున్నారు. అరియానాకు గోల్డ్ మైక్ తీసుకుని కన్ఫెషన్ రూమ్‌కి రావాలని బిగ్‌బాస్ చెప్పారు. అరియానాకు ప్రేక్షకులతో మాట్లాడే అవకాశాన్ని బిగ్‌బాస్ కల్పించారు. అరియానా తనను గెలిపించాలని ప్రేక్షకులకు అప్పీల్ చేసుకుంది. లాన్‌లో కూర్చొని మోనాల్ బాగా బాధ పడుతుంటే అఖిల్ వచ్చి ఓదార్చాడు. అఖిల్‌తో కాకుండా సెపరేట్‌గా తిన్నావని మోనాల్ వచ్చి సొహైల్‌ని అడిగింది. సొహైల్.. చాలా సీరియస్ అయ్యాడు. ప్రతిసారీ నేనెళ్లి మాట్లాడటానికి నేనేమైనా హౌలా గాడినా అంటూ మండిపడ్డాడు. తరువాత అఖిల్ వెళ్లి సొహైల్‌ని హగ్ చేసుకున్నాడు. సెండ్ టైమ్ విత్ మి అని అభి ఓ స్లిప్‌పై రాసి హారిక బెడ్‌పై పెట్టాడు. హారిక.. అభి పడుకుని ఉంటే వెళ్లి హగ్ చేసుకుంది. వీళ్లు కెమెరాలు ఉన్నాయన్న విషయాన్ని కూడా మర్చిపోయినట్టున్నారు.ఇక కంటెస్టెంట్లు నేరుగా అభిమానులతో మాట్లాడే అవకాశాన్ని దక్కించుకునేందుకు బిగ్‌బాస్ మరో టాస్క్ ఇచ్చారు. ఒక కుర్చీని ఏర్పాటు చేసి దాని వెనుక స్మైల్, కోపం, అగ్రెసివ్, వంటి ఎమోజీలను పెట్టారు. వెనుక ఉన్న ఎమోజీల ప్రకారం కుర్చీలో కూర్చొన్న వారిని వెనుక ఉన్న ఎమోజీల లైట్స్ వెలుగుతాయి. ఏ లైట్ వెలిగితే ఆ లైట్‌కి అనుగుణంగా కంటెస్టెంట్‌లో స్మైల్, కోపం వంటివి తెప్పించాలి.
మొదట కుర్చీలో అరియానా కూర్చొంది. తన వెనుక స్మైల్ ఎమోజీ లైట్ వెలిగింది. సొహైల్ అరియానాను నవ్వించేందుకు ప్రయత్నించాడు. ఎన్ని విధాలుగా ట్రై చేసినా అరియానా నుంచి ఎలాంటి ఎక్స్‌ప్రెషన్స్‌నూ రాబట్టలేకపోయారు. మొత్తానికి అరియానా బాగా చేసింది. దీంతో అఖిల్ 4 పాయింట్లను ఇచ్చాడు. తరువాత మోనాల్ వంతు.. ఎమోషన్‌ని రాబట్టేందుకు మోనాల్ చేసిన ట్రైని చాలా సీరియస్‌గా తీసుకున్న అరియానా.. తరువాత తన విశ్వరూపం చూపించింది. మోనాల్‌పై ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఎమోషన్‌ని రాబట్టేందుకు ట్రై చేయకుండా.. గొడవకు దిగింది. చాలా టూ మచ్‌గా అనిపించింది. మోనాల్‌కు అఖిల్ 10 పాయింట్స్ ఇచ్చాడు. నెక్ట్స్ సొహైల్ వెళ్లి కూర్చొన్నాడు. అరియానా చేసిన టూమచ్‌కి మోనాల్ చాలా బాధపడింది. మోనాల్ వెళ్లి కెమెరాకు చెప్పుకుని బాధపడింది. మోనాల్ సోఫాలో పడుకుని బాగా ఏడుస్తుంటే అరియానా చూసి హారికను తీసుకొచ్చింది. మోనాల్‌ను బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచారు. నేనిక్కడ డిజర్వ్ కానని మోనాల్ బిగ్‌బాస్‌కు చెప్పుకుని బాగా ఏడ్చింది. మిమ్మల్ని అందరూ ఇష్టపడుతున్నారు కాబట్టే ఇక్కడి వరకూ వచ్చావని బిగ్‌బాస్ చెప్పారు. రేపు కూడా అరియానా తన విశ్వరూపాన్ని చూపించబోతున్నట్టు ప్రోమోను బట్టి తెలుస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com