Nandamuri Balakrishna:అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య.. దమ్ముంటే రా అంటూ అంబటి సవాల్, బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్‌పై నిరసన తెలిపారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులకు మద్ధతుగా వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ సహా, టీడీపీ సభ్యులు కోరుతున్న అంశాలపై చర్చించడానికి సిద్ధంగా వున్నామని ప్రకటించారు.
మీసాలు తిప్పడాలు సినిమాల్లోనే బాగుంటాయి : అంబటి
ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడటంతో సభలో హీటెక్కింది. టీడీపీ సభ్యులను నిలువరించకపోతే తమ సభ్యులు కూడా రెచ్చిపోతారంటూ కామెంట్ చేశారు. తమను రెచ్చగొడుతున్నారని, తమ దగగరా ఓవరాక్షన్ చేసే వాళ్లు వున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య తమ వైపు చూసి మీసాలు తిప్పుతున్నారని.. అలాంటివి సినిమాల్లో పెట్టుకుంటే మంచిదని చురకలంటించారు. మీసాలు తిప్పడం దమ్ముంటే రా అంటూ బాలయ్యకు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యుల వైపు వైసీపీ ఎమ్మెల్యేలు దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ తమ్మినేని కొద్దిసేపు వాయిదా వేశారు.
మొదటి తప్పుగా బాలయ్యను క్షమిస్తున్నానన్న స్పీకర్ :
అయితే బాలయ్య వ్యవహారంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మీసం తిప్పడంపై బాలయ్యకు వార్నింగ్ ఇచ్చారు. ఈ తరహా ప్రవర్తనతో అసెంబ్లీ గౌరవ సాంప్రదాయాలను ఉల్లంఘించారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నట్లుగా తమ్మినేని సీతారాం వెల్లడించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com