Nandamuri Balakrishna:అసెంబ్లీలో మీసం తిప్పిన బాలయ్య.. దమ్ముంటే రా అంటూ అంబటి సవాల్, బాలకృష్ణకు స్పీకర్ వార్నింగ్

  • IndiaGlitz, [Thursday,September 21 2023]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు చంద్రబాబు అరెస్ట్‌పై నిరసన తెలిపారు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులకు మద్ధతుగా వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా నినాదాలు చేశారు. ఈ వ్యవహారంపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ సహా, టీడీపీ సభ్యులు కోరుతున్న అంశాలపై చర్చించడానికి సిద్ధంగా వున్నామని ప్రకటించారు.

మీసాలు తిప్పడాలు సినిమాల్లోనే బాగుంటాయి : అంబటి

ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడటంతో సభలో హీటెక్కింది. టీడీపీ సభ్యులను నిలువరించకపోతే తమ సభ్యులు కూడా రెచ్చిపోతారంటూ కామెంట్ చేశారు. తమను రెచ్చగొడుతున్నారని, తమ దగగరా ఓవరాక్షన్ చేసే వాళ్లు వున్నారని అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలయ్య తమ వైపు చూసి మీసాలు తిప్పుతున్నారని.. అలాంటివి సినిమాల్లో పెట్టుకుంటే మంచిదని చురకలంటించారు. మీసాలు తిప్పడం దమ్ముంటే రా అంటూ బాలయ్యకు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యుల వైపు వైసీపీ ఎమ్మెల్యేలు దూసుకొచ్చారు. ఈ క్రమంలో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ తమ్మినేని కొద్దిసేపు వాయిదా వేశారు.

మొదటి తప్పుగా బాలయ్యను క్షమిస్తున్నానన్న స్పీకర్ :

అయితే బాలయ్య వ్యవహారంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మీసం తిప్పడంపై బాలయ్యకు వార్నింగ్ ఇచ్చారు. ఈ తరహా ప్రవర్తనతో అసెంబ్లీ గౌరవ సాంప్రదాయాలను ఉల్లంఘించారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నట్లుగా తమ్మినేని సీతారాం వెల్లడించారు.

More News

Bigg Boss 7 Telugu : షర్ట్ విప్పేసిన గౌతమ్ .. ఛాలెంజ్ అంటూ శోభాశెట్టి విశ్వరూపం , పవర్ అస్త్ర కోసం శివాజీ దిగులు

బిగ్‌బాస్ 7 తెలుగులో పవర్ అస్త్ర కోసం ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

Ysrcp MP:రిజర్వేషన్ లేకుండానే 50 శాతం పదవులు.. మహిళా సాధికారతే జగన్ లక్ష్యం : లోక్‌సభలో వైసీపీ ఎంపీలు

దశాబ్థాలుగా భారతీయ మహిళలు కన కల ఇన్నాళ్లకు నెరవేరింది.. అసాధ్యం అనుకున్న దానిని మోడీ షా ద్వయం సుసాధ్యం చేసి చూపించింది.

AP Students:ఐరాసలో ఏపీ విద్యార్ధులు.. ఆ ప్రసంగానికి దేశాధినేతలే ఫిదా, మన సర్కారీ బడులపై మేధావుల ప్రశంసలు

పేదవాడి తలరాతను మార్చేది విద్యేనని ఏపీ సీఎం వైఎస్ జగన్ తరచుగా చెబుతూ వుంటారు. అందుకే అధికారంలోకి వచ్చిన నాటి నుంచే విద్యా రంగానికి ప్రాధాన్యత కల్పించారు.

ANR Centenary:అన్నపూర్ణ స్టూడియోస్‌లో అక్కినేని శతజయంతి వేడుకలు.. ఏఎన్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వెంకయ్య

దిగ్గజ నటుడు, దివంగత అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

Bigg Boss 7 Telugu : రతిక - ప్రశాంత్ గొడవ, శివాజీ పవర్ అస్త్రను కొట్టేసిన అమర్‌దీప్ , ఇంట్లో గలాటా

బిగ్‌బాస్ తెలుగు 7 విజయవంతంగా మూడో వారానికి చేరుకుంది. సోమవారం నామినేషన్స్ పర్వంగా ముగియగా..