ప్రభాస్ 25లో హీరోయిన్గా కరీనా కపూర్..?
Send us your feedback to audioarticles@vaarta.com
పాన్ ఇండియన్ స్టార్‌గా దూసుకెళ్తున్న ప్రభాస్ .. వరుసపెట్టి సినిమాలను పట్టాలెక్కిస్తున్నారు. ఆయన ఓకే చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ భారీ బడ్జెట్ సినిమాలే.. ఇప్పటికే ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ‘‘సలార్’’ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయన మాఫియా డాన్ గా కనిపించనున్నాడు. ఈ సినిమాలో శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రీకరణలోనూ పాల్గోంటున్నాడు ప్రభాస్. ఇవే కాకుండా.. మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ సినిమా చేయనున్నాడు.
నేపథ్యంలోనే ఇటీవల ప్రభాస్ 25వ సినిమాకి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చింది. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ మూవీలో నటించబోయే హీరోయిన్ విషయంలో ఓ ఆసక్తికర ప్రచారం మొదలైంది.
బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌తో ఆడిపాడేందుకు బాలీవుడ్ హీరోయిన్లు సైతం ఆసక్తి చూపుతున్నారు. ఆ లిస్ట్‌లో సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. స్పిరిట్ చిత్రం కోసం మేకర్స్ హీరోయిన్ గా కరీనాని సంప్రదిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం కరీనా ఫస్ట్ తెలుగు డెబ్యూ మూవీ ఇదే అవ్వడంతో పాటు ప్రభాస్-కరీనా కాంభినేషన్పై భారీ అంచనాలు నెలకొంటాయి. ప్రస్తుతం కరీనా వయసు 41 సంవత్సరాలు.. పైగా ఇద్దరు పిల్లలకు తల్లి కూడా. కానీ ఆమె అందంలో ఎలాంటి మార్పు రాలేదు. కాగా.... ప్రభాస్ ఆదిపురుష్ చిత్రంలో కరీనా భర్త, బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నారు. ఇప్పటికే ఆ జంటను ఖుషీ చేసేందుకు ప్రభాస్ బిర్యానీ ట్రీట్ ఇచ్చాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments