'' ఆర్ యు మ్యారీడ్ ?'' చిత్రం ప్రారంభం..

  • IndiaGlitz, [Friday,October 06 2017]

మౌర్య ,చరిష్మా హీరో హీరోయిన్లుగా సెవెన్ హిల్స్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రం గా నిర్మిస్తున్న సినిమా '' ఆర్ యు మ్యారీడ్ ?'' .రొమాంటిక్ లవ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి అళహరి దర్శక నిర్మాత. ఫిలిం ఛాంబర్ లో ప్రారంభమైన ఈ సినిమా వేడుకకు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యి యూనిట్కి శుభాకాంక్షలు తెలిపారు.

హీరో హీరోయిన్ ల మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత మల్కాపురం శివకుమార్ క్లాప్ నివ్వగా ,,ప్రవాస భారతీయుడు చిట్టిమల్ల రఘు కెమెరా స్విచ్ ఆన్ చేసారు..ఈ సందర్భంగా దర్శక నిర్మాత అళహరి మాట్లాడుతూ '' ఎవరి ఊహలకు అందని విధంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను..గ్రాఫిక్ వర్క్ తో భారీ బడ్జెట్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 23 నుండి ప్రారంభం అవుతుంది.

పెళ్లీడుకొచ్చిన యువతీ యువకుల భావోద్వేగాలను, ప్రసుత జనరేషన్ లైఫ్ స్టైల్ ని ఈ సినిమా ద్వారా చూపించనున్నాము. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే రీతి లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని'' చెప్పారు..

మల్కాపురం శివ కుమార్ మాట్లాడుతూ..చక్కని కాన్సెప్ట్ తో నిర్మితమవుతున్న సినిమా ఇది అని చెప్పారు. '' కాన్సెప్ట్ నచ్చి ఈ ప్రాజెక్టులో భాగస్వామినయ్యానని ఎన్.ఆర్. ఐ. చిట్టిమల్ల రఘు చెప్పారు.. ఈ కార్యక్రమంలో కెమెరా మెన్ నర్సింగ్ రావు, సంగీత దర్శకుడు జయ సూర్య ,రచయిత కాంచనపల్లి రాజేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు..

More News

నిర్మాతగా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారే నా ఆదర్శం: సురేశ్ కొండేటి

‘చిత్రసీమలోకి వచ్చిన తర్వాత కూడా నాకు పుట్టిన రోజు (అక్టోబర్ 6వ తేదీ)ని వేడుకగా జరుపుకోవడం అలవాటు లేదు. అయితే ఓసారి ‘మగధీర’ ప్రెస్ మీట్ కు వెళ్ళినప్పుడు ఆ చిత్ర నిర్మాత శ్రీ అల్లు అరవింద్ గారికి ఆ వేళ నా బర్త్ డే అనే విషయం తెలిసి… వెంటనే కేక్ తెప్పించి, బర్త్ డే జరిపించారు.

విజయ్ అదిరింది కి అరుదైన గౌరవం...

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న 61వ ప్రతిష్టాత్మక చిత్రం అదిరింది. ఈ చిత్రం టీజర్ కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. 1.5 మిలియన్ వ్యూస్ తో తెలుగు స్టార్ హీరోల చిత్రాలకు ధీటుగా వ్యూస్ రావడంతో ఆయన తెలుగు అభిమానులు ఫుల్ ఖుషీ గా వున్నారు. ఈ సినిమాతో తెలుగు లో విజయ్ తన సత్తా చూపించబోతున్నాడు.

సోడా గోళీసోడా ఆడియో విడుదల

ఎస్ బి ఆర్ట్ క్రియేషన్స్ అనే నూతన నిర్మాణ సంస్థ తమ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రం సోడా గోలీసోడా ని విజయవంతంగా చిత్రీకరణ పూర్తీ చేసుకుని నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఈ నెల 5 వ తారీఖున రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో ఆడియో విడుదల వీడుక ప్రముఖుల మధ్య  అంగరంగవైభవంగా జరుపుకుంది. 

వి4మూవీస్ నెక్ట్స్ నువ్వే ఆడియో విడుద‌ల‌

ఆదిసాయికుమార్ హీరోగా, ప్ర‌భాక‌ర్.పి ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ వి4 మూవీస్ బ్యాన‌ర్ లో ప్ర‌ముఖ నిర్మాత బ‌న్ని వాసు నిర్మిస్తున్న చిత్రం ఇటీవ‌లే షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుంది.ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటున్న ఈ చిత్రానికి సంబందించి ట్రైల‌ర్ ఇటీవ‌లే విడ‌దల‌య్యి మంచి స్పంద‌న పొంద

చైనీస్ తెలుగు హీరోయిన్‌....

జ‌య‌.బి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ల‌వ్‌లీ సినిమాతో తెలుగు హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన శాన్వి శ్రీ వాస్త‌వ త‌ర్వాత రౌడీ స‌హా కొన్ని చిత్రాల్లో న‌టించింది. అయితే తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను సొంతం చేసుకోలేక‌పోయింది.