వైట్ రైస్ తింటున్నారా? ఈ విషయం తెలిస్తే...
- IndiaGlitz, [Saturday,November 28 2020]
మనం తినే అన్నం తెల్లగా మల్లెపూవులా ఉండాలని అంతా భావిస్తూ ఉంటాం. అది ఆరోగ్యానికి చాలా హానికరమని కొందరికి మాత్రమే తెలుసు. తెల్లటి అన్నాన్ని రోజూ తింటున్నారా? ఈ విషయం తెలిస్తే మాత్రం వైట్ రైస్ జోలికి వెళ్లరు.. తెల్లటి అన్నం బ్లెడ్‌లో షుగర్ లెవల్స్‌ని పెంచుతుంది. తెల్లటి అన్నాన్ని రోజూ తినడం వలన డయాబెటిస్ వంటి రోగాలకు రోగాలకు కారణమవుతుంది. హార్వార్డ్ మెడికల్ స్కూల్ అధ్యయనం ప్రకారం.. తెల్లటి అన్నం తినడం అంటే.. ప్యూర్ టేబుల్ షుగర్‌ను తినడమేనని వెల్లడించింది.
వైట్ రైస్‌ను తీసుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని.. బ్రౌన్ రైస్ కానీ.. లేదంటే పట్టు తక్కువ ఉన్న రైస్‌ను తీసుకోవడం కారణంగా బాడీకి అవసరమైన న్యూట్రియెంట్స్, ప్రోటీన్, ఫైబర్ అందుతాయని హార్వార్డ్ మెడికల్ స్కూల్ తెలిపింది. ప్రపంచంలో సగానికి పైగా జనాభా రైస్‌ను ఆహారంగా తీసుకుంటారు. 2018లో 485 మిలియన్ మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా పండించింది. బ్రౌన్ రైస్ కంటే వైట్ రైస్ కామన్‌గా ఎక్కువగా వినియోగిస్తుంటారు ఎందుకంటే వైట్ రైస్ ఎక్కువ కాలం మన్నడంతో పాటు రవాణా కూడా చాలా సులభం. కానీ వైట్ రైస్‌లో చాలా తక్కువ న్యూట్రియెంట్స్ ఉంటాయి.
వైట్, బ్రౌన్ రైస్‌లనేవి వేర్వేరు స్పైసెస్ నుంచి వచ్చినవి కావు. రెండూ వడ్ల నుంచి వచ్చినవే కానీ బ్రౌన్ రైస్‌కు వైట్ రైస్‌లో లేని కొన్ని ముఖ్యమైన లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి బ్రౌన్ రైస్‌కు దాని రంగును ఇవ్వడమే కాదు.. అవి బియ్యం యొక్క అత్యంత పోషక విలువలను కూడా కలిగి ఉంటాయి. ఒక ఇబ్బంది ఏమిటంటే బ్రౌన్ రైస్ సగటు షెల్ఫ్ జీవితం సుమారు ఆరు నెలలు మాత్రమే. తెల్ల బియ్యం మన్నిక మాత్రం చాలా కాలం ఉంటుంది. వైట్ రైస్‌ను ఉడికించడం సులభం. అలాగే బ్రౌన్ రైస్ కంటే తక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.