ఈ ఏడాది ఆ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు లేనట్టేనా?
Send us your feedback to audioarticles@vaarta.com
గతేడాది.. టాలీవుడ్‌కు మంచి విజయాలను అందించిన కథానాయకులలో చిరంజీవి, ప్రభాస్, ఎన్టీఆర్‌లను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పదేళ్ళ తరువాత కథానాయకుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఖైదీ నెం 150తో సంచలన విజయాన్ని నమోదు చేశారు. ఆయన నటన, నర్తనలో గ్రేస్ కొంచెం కూడా తగ్గలేదని ఈ సినిమా నిరూపించింది. ఇక ప్రభాస్ విషయానికొస్తే.. భారతీయ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రగా నిలిచిన బాహుబలి - ది కంక్లూజన్ సినిమాలో కథానాయకుడిగా నటించి ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు.
అలాగే జై లవకుశ చిత్రంలో మూడు విభిన్న పాత్రల్లో కనిపించి ఎన్టీఆర్ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలాంటి ఈ ముగ్గురు అగ్ర కథానాయకుల నుంచి ఈ ఏడాది సినిమా వచ్చే అవకాశం కనిపించడంలేదనే చెప్పాలి. చిరు నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి, ప్రభాస్ సాహో, ఎన్టీఆర్ 28వ చిత్రం (త్రివిక్రమ్ దర్శకుడు).. ఈ సంవత్సరం విడుదలయ్యే అవకాశం లేదని, 2019లోనే ఈ సినిమాలు వస్తాయని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఏడాది ఓ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు రాకుండానే.. గడిచిపోనుందన్నమాట.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com