ఈ ఏడాది ఆ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు లేనట్టేనా?

  • IndiaGlitz, [Thursday,March 01 2018]

గ‌తేడాది.. టాలీవుడ్‌కు మంచి విజ‌యాల‌ను అందించిన క‌థానాయ‌కుల‌లో చిరంజీవి, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్‌ల‌ను ప్ర‌త్యేకంగా చెప్పుకోవాలి. ప‌దేళ్ళ త‌రువాత క‌థానాయ‌కుడిగా రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ఖైదీ నెం 150తో సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేశారు. ఆయ‌న న‌ట‌న‌, న‌ర్త‌న‌లో గ్రేస్ కొంచెం కూడా త‌గ్గ‌లేద‌ని ఈ సినిమా నిరూపించింది. ఇక ప్ర‌భాస్ విష‌యానికొస్తే.. భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్ర‌గా నిలిచిన బాహుబ‌లి - ది కంక్లూజ‌న్ సినిమాలో క‌థానాయ‌కుడిగా న‌టించి ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు.

అలాగే జై ల‌వ‌కుశ చిత్రంలో మూడు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించి ఎన్టీఆర్ మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. అలాంటి ఈ ముగ్గురు అగ్ర క‌థానాయ‌కుల నుంచి ఈ ఏడాది సినిమా వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డంలేద‌నే చెప్పాలి. చిరు న‌టిస్తున్న సైరా న‌రసింహా రెడ్డి, ప్ర‌భాస్ సాహో, ఎన్టీఆర్ 28వ చిత్రం (త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌కుడు).. ఈ సంవ‌త్స‌రం విడుద‌ల‌య్యే అవ‌కాశం లేద‌ని, 2019లోనే ఈ సినిమాలు వ‌స్తాయ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ఏడాది ఓ ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు రాకుండానే.. గ‌డిచిపోనుంద‌న్న‌మాట‌.

More News

నాగార్జున కెరీర్‌లో మ‌రో స్పెష‌ల్ మూవీ అవుతుందా?

నాగార్జున కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిలిచిన చిత్రాలలో అన్న‌మ‌య్య‌, మ‌నం త‌ప్ప‌కుండా ఉంటాయి. ఈ రెండు చిత్రాల‌కి ఓ ప్ర‌త్యేకత ఉంది. అదేమిటంటే.. ఆయా సినిమాలు మే నెలాఖ‌రులో విడుద‌ల‌వ‌డం.

రాజ‌మౌళితో మొద‌లుపెడుతున్న రామ్ చ‌ర‌ణ్‌

క‌థానాయ‌కుడిగా రామ్ చ‌ర‌ణ్ కెరీర్ మొద‌లై ప‌దేళ్ళు దాటింది. ఈ ప‌దేళ్ళ కాలంలో హీరోగా ప‌ది సినిమాలతో సంద‌డి చేశాడు చ‌ర‌ణ్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న 11 వ చిత్రం రంగ‌స్థ‌లం.. మార్చి 30న విడుద‌ల కానుంది.

మహేష్ అన్న తనయుడు సినిమాల్లోకి...

సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ సినిమాల్లో టాప్ స్టార్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే.

విలన్ పాత్రలో తమిళ హీరో

కన్నడం,తెలుగులో విడుదలవుతున్న చిత్రం 'రాజారథం'.

కాలాకి తెలుగులో ఆదరణ కరువైందా?

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.