షాకింగ్ న్యూస్: విడాకుల యోచనలో ప్రియాంక-నిక్!?

  • IndiaGlitz, [Saturday,March 30 2019]

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ విడాకులు తీసుకోబోతున్నారా..? భార్య భర్తల మధ్య గొడవల వల్ల త్వరలోనే విడిపోవడానికి సిద్ధపడ్డారా..? అంటే అవునని జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్నాయి. అయితే అసలు ఇందులో నిజమెంత..? అబద్ధమెంత..? అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా- అమెరికన్ సింగర్ నిక్ జోనస్ ప్రేమించుకొని.. పెళ్లి అనే బంధంతో 2018 డిసెంబర్‌లో ఒకింటివాళ్లయిన విషయం విదితమే. త‌న క‌న్నా వ‌య‌స్సులో చిన్న‌వాడు అయినప్పటికీ ప్రేమించిన ప్రియాంక ఇంట్లో పట్టుబట్టి మరీ పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి జరిగిన మరుక్షణం నుంచే ఈ బంధం పట్టుమని పది రోజులు కూడా ఉండదని అప్పట్లోనే పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. అయితే రూమర్స్ వస్తుంటాయ్.. వాటన్నింటికీ ఎందుకు సమాధానం చెప్పాలన్నట్లుగా ఈ కొత్త జంట ఎక్కడా స్పందించలేదు. పెళ్లయిన వెంటనే ప్రియాంక-నిక్ ఎంచక్కా హానీమూన్‌కు వెళ్లారు.. ఏ గొడవలు లేకుండా హ్యాపీగా జీవితాన్ని గడిపేస్తున్నారు. అయితే కొద్దిరోజుల తర్వాత ప్రియాంక ప్రెగ్నెన్సీ అని వార్తలు రాగా అవన్నీ ఒట్టి పుకార్లేనని ఆమె తల్లి మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది.

కారణాలివేనట..
అయితే తాజాగా.. ఓ బ్రిటన్ మ్యాగజైన్.. భర్త నిక్ నుంచి విడిపోవాడినికి ప్రియాంక చోప్రా రెడీ అయిందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సదరు మ్యాగజైన్ కారణాలు కూడా వివరించింది. నిక్‌తో ప్రియాంక‌కు అస్సలు ప‌డట్లేదట. నిత్యం ఏదో ఒక విష‌యంలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయని సదరు మ్యాగజైన్ తెలిపింది. పని, పార్టీలు, ఒకరితో ఒకరు కలిసే ఉండే విషయంలో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయట. ఎంత త్వరగా పెళ్లి చేసుకున్నారో.. అంత త్వరగా దాన్ని ముగించబోతున్నారు. వారి బంధం ఓ దారం ఆధారంగా వేలాడుతోంది. అది ఎప్పుడైనా తెగిపోవచ్చు. నిక్‌ ప్రియాంకను చూసి చాలా ప్రశాంతంగా ఓర్పుగా ఉంటుందని భావించాడట. కానీ ఈ మధ్య ప్రియాంక డామినేషన్‌ పెరిగిపోయిందని టాక్ నడుస్తోంది. ఆమెకు కోపం కూడా ఎక్కువేనట. పెళ్లయిన తర్వాత ప్రియాంక సినిమాలు మానేసి పిల్లాపాపలతో సెటిల్ అవుతుందని అత్తా మామలు భావించారట. అయితే ప్రియాంక ఇప్పుడు కూడా 21 ఏళ్ల యువతిలాగా ప్రవర్తిస్తోందట. ఆమె వ్యవహారం నిక్‌ కుటుంబ సభ్యులకు నచ్చలేదట. దీంతో ప్రియాంకతో విడాకులు తీసుకోవాలని నిక్‌పై అతని తల్లిదండ్రులు ఒత్తిడి తెస్తున్నారట అని సదరు మ్యాగజైన్ కథనాలు వండి వార్చింది.

అయితే ఈ వార్త‌ల్లో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఈ వార్త కొన్నిగంటలుగా జాతీయ మీడియా మొదలుకుని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రియాంక, నిక్ అభిమానులు, సినీ ప్రియులు ఒకింత షాకయ్యారు. అయితే ఈ వార్తలు నిజమేనా..? లేక పుకార్లేనా అనేది తెలియాలంటే ప్రియాంక లేదా నిక్.. లేకుంటే ఇరువురి కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు మీడియా ముందుకు వస్తేగానీ క్లారిటీ వచ్చే అవకాశాల్లేవ్.

More News

బాబు మాట వింటే నట్టేట మునిగినట్లే.. జగన్‌కు చాన్సివ్వండి!

టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై టాలీవుడ్ సీనియర్ నటుడు, వైసీపీ నేత మంచు మోహన్ బాబు మరోసారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

మళ్లీ రెచ్చిపోయిన బాలయ్య.. షాక్ ఇచ్చిన కార్యకర్త!

టాలీవుడ్ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నందమూరి బాలకృష్ణ మరోసారి రెచ్చిపోయారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సొంత పార్టీ కార్యకర్తపై బాలయ్య చిందులేయగా.

'బ్రోచేవారెవ‌రురా'లో నివేదా థామ‌స్ లుక్‌

'బ్రోచేవారెవ‌రురా'... టైటిల్‌తోనే ఆక‌ట్టుకున్న సినిమా. ఈ సినిమాలో త‌న పాత్ర గురించి నివేదా థామ‌స్ ఆ మ‌ధ్య గొప్ప‌గా చెప్ప‌డంతో సినిమాపై అమాంతం క్రేజ్ పెరిగింది.

నాని 'వ్యూహం' చేస్తున్నారా?

నాని హీరోగా రానున్న 'జెర్సీ' మీదే అంద‌రి దృష్టి ఉంది. అయితే ఈ సినిమాతో పాటు ఆయ‌న చేయ‌బోయే త‌దుప‌రి సినిమా గురించి కూడా ప‌లువురు ఆరా తీస్తున్నారు.

25వ సినిమా... ఎందుకిలా..

మ‌హేష్ న‌టిస్తున్న 25వ సినిమా మ‌హ‌ర్షి. మే 9న విడుద‌ల కానుంది. పూజా హెగ్డే, అల్ల‌రి న‌రేష్ కూడా ఇందులో కీల‌క పాత్ర‌దారులు.వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.