నవంబర్ 13న లవర్‌తో నటి అర్చన పెళ్లి
Send us your feedback to audioarticles@vaarta.com
2004లో ‘నేను’ సినిమాతో తెరంగేట్రం చేసిన అర్చన.. తెలుగుతో పాటు కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే సరైన హిట్ లేకపోవడంతో హీరోయిన్గా నిలదొక్కుకోలేకపోయింది. అప్పట్లో బిగ్‌బాస్ సీజన్-1 కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి వెళ్లొచ్చిన తర్వాత ఈ భామ అందరికీ గుర్తుండిపోయింది. అయితే సినిమాలో ఆశించినంతగా రాణించలేకపోవడం.. అవకాశాలు రాకపోవడంతో ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన అర్చన.. తను ప్రేమించిన ప్రముఖ వ్యాపార వేత్త జగదీశ్‌తో అక్టోబర్-04న నిశ్చితార్థం చేసుకుంది.
కాగా.. ఈ ప్రేమ జంట నవంబర్-13న పెళ్లితో ఒకటి కానుంది. ఈ విషయాన్ని అర్చన తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంటే త్వరలోనే అర్చన ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయన్న మాట. డేట్ ఫిక్సవ్వగానే ఎవరెవర్ని ఆహ్వానించాలి..? ఇండస్ట్రీకి చెందిన పెద్దలెవర్ని ఆహ్వానించాలి..? పారిశ్రామికవేత్తలు ఎవరెవర్ని ఆహ్వానించాలి..? అని అటు వధువు.. ఇటు వరుడు కుటుంబ సభ్యులు ప్లాన్లు చేస్తున్నారట. కొద్దికాలంగా జగదీశ్, అర్చన ప్రేమించుకున్నారు.. ఇప్పుడు పెళ్లితో ఒక్కటవ్వబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments