మాజీ భార్య పెళ్లిపై అర్బాజ్ స్పంద‌న‌...

  • IndiaGlitz, [Tuesday,April 02 2019]

బాలీవుడ్‌లో అర్జున్ క‌పూర్‌, మ‌లైకా ఆరోరాలు ఈ నెల 19న పెళ్లి చేసుకోబోతున్నార‌ని వార్త‌లు వచ్చిన సంగ‌తి తెలిసిందే. మలైకా అరోరా ద‌ర్శ‌క నిర్మాత అర్బాజ్ ఖాన్ మాజీ భార్య‌. ఇత‌ని నుండి విడాకులు తీసుకున్న మ‌లైకా ఇప్పుడు త‌న కంటే చిన్న వాడైన అర్జున్ క‌పూర్‌ను పెళ్లి చేసుకోనుంది. అయితే ఈ పెళ్లి గురించి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా లేదు.

ఈ నేప‌థ్యంలో ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న అర్బాజ్ ఖాన్‌ను ఓ విలేఖ‌రి.. అర్జున్ క‌పూర్‌, మ‌లైకా అరోరా పెళ్లి గురించి ప్ర‌శ్నించాడు. ప్ర‌శ్న విన్న అర్బాజ్ ఖాన్ గ‌ట్టిగా న‌వ్వేసి.. ఈ ప్ర‌శ్న అడ‌గ‌టానికి మీరు రాత్రంతా ఆలోచించే ఉంటారు.. మ‌రి స‌మాధానం చెప్ప‌డానికి నేను ఆలోచించాలి క‌దా! రేపు స‌మాధానం చెప్ప‌నా! అంటూ స‌మాధానం చెప్ప‌కుండా దాట‌వేశారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది.