అరవింద సమేత.. టీజర్, ఆడియో ఫంక్షన్ వివరాలు
Send us your feedback to audioarticles@vaarta.com
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే, ఈషా రెబ్బా కథానాయికలు. తమన్ సంగీత దర్శకుడు. యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కనిపించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఆడియో ఫంక్షన్‌ను వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ రెండో వారంలో చేయబోతున్నారని తెలిసింది. మరి ఈ కథనాల్లో ఎంత వాస్తవముందో త్వరలోనే తెలుస్తుంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ సినిమా విజయ దశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments