Aravindha Sametha Review
చెప్పే వ్యక్తిని బట్టి, చెప్పే సమయాన్ని బట్టి విషయం విలువే మారిపోతుంది... నిజమే. మనకు తెలిసిన ప్రతి విషయాన్ని త్రివిక్రమ్ చెప్తే `ఏం చెప్పాడ్రా` అనిపిస్తుంది. గుక్కతిప్పుకోకుండా అదే విషయాన్ని ఎన్టీఆర్ పలికితే `తెలుగు ఇంత బావుంటుందా` అనిపిస్తుంది. ఆయన మాట.. ఈయన నోట వినేతరుణం రానే వచ్చింది. అదీ మామూలుగా కాదు.. ప్రత్యేకమైన యాసలో. ఇప్పటికే అరెరరెరరెరే.. అరవిందట తన పేరు.. పెనిమిటి పాటలు మారుమోగుతున్నాయి. స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నాయికగా నటించిన ఈ సినిమా ముచ్చట్లు మీకోసమే.
కథ:
నారపరెడ్డి (నాగబాబు) కుమారుడు వీరరాఘవరెడ్డి(ఎన్టీఆర్). అందరూ ఇంట్లో అతన్ని వీర అని అంటారు. పన్నెండేళ్లు కన్నవారికి దూరంగా విదేశాల్లో ఉంటూ చదువుకుంటూ ఉంటాడు. ఒకసారి ఊరికి వస్తాడు. ఆ సమయంలో అతని కళ్ల ముందే అతని తండ్రిని, మామను నల్లగుడి చెందిన బసిరెడ్డి (జగపతిబాబు) మనుషులు చంపేస్తారు. అప్పటిదాకా కత్తికూడా పట్టుకోని వీర తన చేత్తో కత్తిని పట్టుకుని వీరవిహారం చేస్తాడు. అతని చేతికి కత్తి మొలిసినట్టు ఉందని చెప్పుకుంటారు ఆ ఊళ్లో వాళ్లు. ఆ విషయం అతని నాన్నమ్మకు వినిపిస్తుంది. అయితే అది తర్వాతి తరం వాళ్లకు లోపం కాకూడదని మనవడికి చెబుతుంది అతని బామ్మ. వెంటనే హైదరాబాద్‌కు వెళ్తాడు. అక్కడ రాఘవ అనే పేరుతో ఉంటాడు. అక్కడ అతనికి నీలాంబరి (సునీల్), లాయర్ (నరేష్) కుమార్తె అరవింద (పూజా హెగ్డే) పరిచయమవుతారు. అరవింద ఫ్యాక్షన్‌కి సంబంధించి స్పెషలైజేషన్ చదువుతూ ఉంటుంది. అతనికి ఆమె చెప్పే కొన్ని మాటలు యాదృచ్చికంగా నచ్చుతుంటాయి. వాటిని పట్టుకుని తన సమస్యలకు సమాధానాలను వెతుక్కుంటుంటాడు. ఆ క్రమంలో ఆమెకు దగ్గరవుతాడు. అరవింద కూడా అతన్ని ఇష్టపడుతుంది. అదే సమయంలోనే బసిరెడ్డి కుమారుడు బాలిరెడ్డి (నవీన్ చంద్ర)ను కలిసి మాట్లాడుతాడు. దాని తర్వాత ఏమైంది అనేది ఆసక్తికరం. వీరరాఘవరెడ్డి తన నియోజకవర్గంలో పోటీ చేశాడా? ఆ సీటులో మరెవరో పోటీ చేశారు? వీరరాఘవ రెడ్డి కోరుకున్న మార్పును తీసుకురాగలిగాడా? లేదా? అనేది ఆసక్తికరం.
ప్లస్ పాయింట్లు:
పాలిచ్చే ఆడవాళ్లు పాలించలేరా అని క్లైమాక్స్ లో ఓ డైలాగ్ ఉంటుంది. 30 ఏళ్లకు ఓ సారి టార్చ్ బేరర్స్ వస్తుంటారు. దాన్ని తరం అంటారు, జనరేషన్ అంటారు.. సినిమా వాళ్లయితే ట్రెండ్ అంటారు అని ఇంకో డైలాగ్ ఉంది. టీజర్లో చెప్పనిదేదీ సినిమాలో లేదు. తన సినిమా ఏంటో టీజర్లోనూ, ఇంటర్వ్యూల్లోనూ స్పష్టంగా చెప్పేశారు త్రివిక్రమ్. కాకపోతే ఆయన ఎంపిక చేసుకున్న కథను అల్లాటప్పాగా తీయకుండా రాయలసీమ పద్ధతులు.. (చనిపోయిన వ్యక్తులను అరటాకుల మీద పెట్టడం, కాటిలో ఏడుస్తూ పాటలు పాడటం), అక్కడి యాస (సగిలిపొద్దు వచ్చిండావే.. ఇడిసినాడు, వచ్చాండా.. మింద... ఇత్యాది)తో కలిపి చెప్పాడు. దాని వల్ల సినిమాకు వెయిట్ వచ్చింది. పాటలు విడుదలైనప్పటి నుంచీ చార్ట్ బస్టర్ కావడంతో సినిమా మీద పాజిటివ్ టాక్ రావడానికి ఉపయోగపడ్డాయి. ఎన్టీఆర్ నోట రాయలసీమ శ్లాంగ్ వినడానికి బావుంది. పూజా హెగ్డే బలవంతంగా తెలుగు మాట్లాడినట్టు అనిపించినా గొంతు బాగానే ఉంది. రాయలసీమ లోని కొన్ని ప్రాంతాలు, అక్కడి మనుషులను చక్కగా చూపించే ప్రయత్నం చేశారు. రెడ్డి పాటలో సెట్టింగ్ చాలా బావుంది. ఎన్టీఆర్ నటనతో మెప్పించాడు.

మైనస్ పాయింట్లు:
సునీల్‌కి ఇది రీ ఎంట్రీ సినిమా అని పాపం సునీల్‌తో పాటు అందరూ ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ తుస్సుమనిపించింది అతని పాత్ర. నరేష్ కేరక్టర్ `అ..ఆ`కి కొనసాగింపుగా అనిపిస్తుంది అంతే. ఈశ్వరీరావు పాత్ర `కాలా` పాత్రను గుర్తుకు తెచ్చింది. నాగబాబుకి రెండు డైలాగులు మాత్రమే ఉన్నాయి. దేవయాని ప్లేస్‌లో సితార, సితార స్థానంలో దేవయాని ఉంటే బావుండనిపించింది. అనవసరమైన షాట్స్ ఎక్కువగా ఉన్నట్టనిపించాయి. తొలిసగంలోఎంటర్‌టైన్‌మెంట్ ఉందనిపించినా, ఎక్కువ ల్యాగ్ కూడా అనిపించింది. పెనిమిటి పాటను తెరపై ప్లేస్‌మెంట్ సరైందేనా అనే అనుమానం కలగకమానదు. ఈషా రెబ్బాకి చెప్పుకోదగ్గ పాత్ర ఏమీ లేదు.
విశ్లేషణ:
భర్త క్షేమం కోరుకునే భార్య, ఓ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోతే ఉండే ఎమోషన్ ఆధారంగా చేసుకుని దర్శకుడు త్రివిక్రమ్.. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించిన చిత్రం అరవింద సమేత. ఎన్టీఆర్ ఫ్యాక్షన్ సినిమాలో హీరో అంటే ఆది, సాంబ సినిమాల తరహాలో ఉంటుందనుకుంటే పొరపాటే త్రివిక్రమ్ స్టయిల్ ఆఫ్ ఎమోషనల్ ఫ్యాక్షన్ మూవీ. ఎన్టీఆర్ లాంటి హీరోతో ఇంత ఎమోషనల్ కంటెంట్ చేయాలనుకోవడం కూడా సాహసం ఇలాంటి ఎమోషనల్ పాయింట్ ఉన్న కథను ఎంచుకున్నందుకు .. అందుకు తగ్గట్లు సిక్స్ ప్యాక్ బాడీ పెంచి, డాన్సులు చేసి మెప్పించిన ఎన్టీఆర్‌ను ముందుగా అభినందించాలి. తండ్రి మరణంతో శత్రువుల చావును కోరుకోకుండా.. అందరూ బావుండాలని కోరుకునే యువకుడుగా ఎన్టీఆర్ చక్కటి నటనను కనపరిచాడు. తండ్రిని చంపిన పగవారిని కూడా చంపకుండా శాంతిని కోరుకుని.. అందరూ మంచిగా ఉండాలని .. ప్రేమించిన అమ్మాయి చెప్పిన మాటలు విని వదిలేయకుండా అది తనకు అన్వయించుకుని దానికి అనుగుణంగా శాంతి కోసం పాటుపడటం.. విలన్స్ హీరోయిన్ తమ్ముడిని కిడ్నాప్ చేసే సందర్భంలో వారి బారి నుండి కుర్రాడిని కాపాడే ఫైట్.. హీరోయిన్ మరో సందర్భంలో విలన్స్ కిడ్నాప్ చేస్తే వారిని తన మాటలతోనే భయపెట్టి హీరోయిన్‌ను కాపాడుకోవడం.. శాంతి కోసం తన పగవాడి పార్టీ లీడర్‌తో.. తన పార్టీ లీడర్‌తో మాట్లాడే సందర్భంలో వచ్చే ఎమోషన్స్‌ను చక్కగా పలికిచడంలో ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు. ఇక త్రివిక్రమ్ పరంగా చూస్తే కథను ఎమోషనల్ సీన్స్‌ను బలమైన డైలాగ్స్‌తో రాసుకున్న త్రివిక్రమ్ కామెడీ పరంగా ఎక్కడా జాగ్రత్తలు తీసుకోలేదు. దీంతో ప్రేక్షకుడికి అంత హెవీ ఎమోషన్‌ను క్యారీ చేయడం కష్టమే. ముఖ్యంగా యూత్ ప్రేక్షకులకు ఎన్టీఆర్ అంటే హీరోయిజం, డాన్సులే. కానీ హీరోయిజం ఎలివేట్ చేసిన తీరు గొప్పగా లేదు. ఇక రెడ్డి ఇక్కడ సూడు ... పాటలో మాత్రమే ఎన్టీఆర్ డాన్సు ఎఫెక్ట్ చూపించాడు. హీరోయిన్ పూజా హెగ్డే పాత్రకు టైటిల్ ఉన్నంత ప్రాధాన్యత కథ పరంగా కనపడదు. ఇక ఈషా రెబ్బా పాత్ర మరి చిన్నదిగా ఉంది. మెయిన్ విలన్‌గా నటించిన జగపతిబాబు లెజెండ్ తర్వాత ఆ స్థాయి విలనిజాన్నితెరపై చూపించాడు. పక్కా ఫ్యాక్షనిస్ట్ పాత్రలో తనదైన నటనతో మెప్పించాడు. సునీల్ కామెడీకీ పెద్దగా స్కోప్ లేదు. ఇక నవీన్ చంద్ర, నరేశ్, దేవయాని,సితార, ఈశ్వరీ రావు, సుప్రియా పాథక్ అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు. పి.ఎస్.వినోద్ కెమెరా పనితం బావుంది. తమన్ నేపథ్య సంగీతం బావుంది. పాటలు బాగానే పిక్చరైజేషన్ ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. క్లైమాక్స్‌ను సింపుల్‌గా డిజైన్ చేయడం ఓ రకంగా మంచిదే. యుద్దం గెలవనివాడికి శాంతిని కోరుకునే హక్కు లేదు. 99 అడుగులు తవ్విన వాడికి 100 అడుగు తవ్వకపోతే ఏంటనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఈ ఒక్క అడుగు వంద అడుగులతో సమానం. అనే డైలాగ్స్‌తో పాటు అబ్బాయి.. అమ్మాయి ప్రేమ గురించి ఎన్టీఆర్.. పూజా హెగ్డేతో చెప్పే సందర్భంలో డైలాగ్స్ బావుంటాయి.
చివరగా.. ఎన్టీఆర్ సినిమా అంటే హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌తో అడుగడుగునా హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సన్నివేశాలు, మోకాళ్లు అరిగిపోయేంత డాన్సులు కావాలనుకునే అభిమానులకు కాస్త భిన్నమైన ట్రీట్ ఇచ్చే ప్రయత్నం చేశారీ చిత్రంతో. యుద్ధం కంటే శాంతి గొప్పదని వీర రాఘవుడి ద్వారా త్రివిక్రమ్ పంపిన శాంతి సందేశమిది
Read Aravindha Sametha Movie Review in English
- Read in English