'అర‌వింద స‌మేత' సెన్సార్ పూర్తి.. అక్టోబ‌ర్ 11న విడుద‌ల‌

  • IndiaGlitz, [Monday,October 08 2018]

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, స్టార్ రైట‌ర్ అండ్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం 'అర‌వింద స‌మేత‌'.... 'వీర రాఘ‌వ‌'. శ్రీమ‌తి మ‌మ‌త స‌మ‌ర్ప‌ణ‌లో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. అక్టోబ‌ర్ 11న ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుద‌ల చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా...

నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు) మాట్లాడుతూ - ''యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌గారితో మా బ్యాన‌ర్‌లో సినిమా చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. నంద‌మూరి అభిమానులే, ఇండ‌స్ట్రీ స‌హా అంద‌ర‌దూ ఈ సినిమా కోసం ఎంత అతృత‌గా ఎదురు చూస్తున్నార‌నే సంగ‌తి తెలిసిందే. అంద‌రి అంచ‌నాల‌ను మించేలా సినిమా ఉంటుంది. మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను నిర్మించాం. స‌రికొత్త యంగ్‌టైగ‌ర్‌ను ద‌ర్శ‌కుడు త్రివిక‌మ్ర్‌గారు తెర‌పై ఆవిష్క‌రించారు. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్‌, ప్రోమోస్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్ పొందింది. సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా అక్టోబ‌ర్ 11న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.