మాస్+ యాక్ష‌న్ = 'అర‌వింద స‌మేత' టీజ‌ర్‌

  • IndiaGlitz, [Wednesday,August 15 2018]

'మండు వేసంగి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా? ....
మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటాదో తెలుసా? ...
మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?' అని జ‌గ‌ప‌తిబాబు డైలాగ్‌తో మొద‌లైన టీజ‌ర్‌..

'కంట‌బ‌డ్డ‌వా.. క‌నిక‌రిస్తానేమో.. యెంట బ‌డ్డానా న‌రికేస్తాను..' అంటూ ఎన్టీఆర్ డైలాగ్‌తో ముగుస్తుంది.
సాధార‌ణంగా త్రివిక్ర‌మ్ సినిమా అంటే ఫ్యామ‌లీ ట‌చ్ ఉంటుంది. కానీ అర‌వింద స‌మేత ..52 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజ‌ర్ మాస్ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకునేలా ఉంది.

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముచ్చుక‌త్తిని ప‌ట్టుకుని విల‌న్స్ భ‌ర‌తం ప‌డుతుండ‌టం.. చెయిర్‌తో ఠీవిగా విల‌న్‌పై కూర్చుని డైలాగ్స్ చెప్ప‌డం.. చివ‌ర్ల‌లో సిక్స్ ప్యాక్ బాడీలో విల‌న్స్‌ను త‌ర‌మ‌డం.. అన్ని చూస్తుంటే.. ఈసారి త్రివిక్ర‌మ్ ప‌క్కా మాస్ యాక్ష‌న్ ఎలిమెంట్స్‌తో ప్రేక్ష‌కుల‌ను, నంద‌మూరి అభిమానుల‌ను మెప్పించేలా ఉంది.

హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్ర‌మ్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

జ‌య‌ప్ర‌ద‌గా..జ‌య‌సుధ‌గా..

దివంగ‌త ముఖ్య‌మంత్రి ఎన్టీఆర్ బ‌యోపిక్ 'య‌న్‌.టి.ఆర్‌' చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో పోషిస్తూ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

మ‌రో రెండు భాష‌ల్లోకి జ‌గ్గూభాయ్ ఎంట్రీ...

హీరోగా కంటే విల‌న్‌గా ఫుల్ బిజీగా ఉన్నాడు జ‌గ‌ప‌తిబాబు. ప్ర‌స్తుతం సైరా న‌ర‌సింహారెడ్డి, యాత్ర‌, అర‌వింద స‌మేత‌, ఎన్‌.జి.కె చిత్రాల‌తో పాటు ఉత్త‌రాదిన స‌ల్మాన్‌ఖాన్ 'ద‌బాంగ్ 3'లో

ప‌వ‌న్ సినిమా రీమేక్‌లో...

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ 'అత్తారింటికి దారేది' . 2013లో విడుద‌లైన ఈ సినిమా అప్ప‌ట్లో స‌రికొత్త రికార్డుల‌కు నాంది ప‌లికింది.

అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌ల‌

ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ కాన్సెప్ట్ పోస్ట‌ర్ విడుద‌లైంది.

డిసెంబ‌ర్ 21న వ‌రుణ్ తేజ్ అంత‌రిక్షం 9000 KMPH

వ‌రుణ్ తేజ్ హీరోగా న‌టిస్తోన్న తొలి తెలుగు స్పేస్ థ్రిల్ల‌ర్ టైటిల్ ప్ల‌స్ ఫ‌స్ట్ లుక్ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా డుద‌లైంది.