‘వి’ కోసం అర‌వింద్ ప్ర‌య‌త్నాలు..!!

వెండితెర నుండి డిజిట‌ల్ రంగం వైపుకు ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఆక‌ర్షితుల‌వుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని అల్లు అర‌వింద్ తెలుగు ఓటీటీ యాప్ ఆహాను స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆహాను తెలుగు వారికి మ‌రింత చేరువ చేయ‌డానికి అల్లు అర‌వింద్ చేయ‌ని ప్ర‌య‌త్నం అంటూ లేదు. టాలీవుడ్‌లోకి కొంత మంది పేరెన్న‌త‌గ్గ ద‌ర్శ‌కుల‌ను, కంటెంట్ రైటర్స్‌ను నియ‌మించుకుని కంటెంట్‌ను డెవ‌ల‌ప్ చేయించుకుంటున్నారు. మ‌రో వైపు కొత్త సినిమాల‌కు సంబంధించి ఓటీటీ హక్కుల‌ను కూడా ద‌క్కించ‌కుంటున్నారు. అందులో భాగంగా రీసెంట్‌గా ‘భానుమ‌తి అండ్‌ రామ‌కృష్ణ‌, కృష్ణ అండ్ హిస్ లీల’ చిత్రాల‌ను ఆహాలో విడుద‌ల చేశారు.

ఇప్పుడు మ‌రో సినిమా కోసం నిర్మాత‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని టాక్ విన‌ప‌డుతోంది. ఆ నిర్మాత ఎవ‌రో కాదు.. దిల్‌రాజు. ఇద్ద‌రి మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ఆ కార‌ణంగా అల్లు అర‌వింద్.. నాని హీరోగా దిల్‌రాజు నిర్మించిన ‘వి’ సినిమా కోసం గ‌ట్టి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఇప్ప‌ట్లో థియేట‌ర్స్ ఓపెన్ అయ్యేలా క‌న‌ప‌డ‌టం లేదు. దీంతో ఈ చిత్రాన్ని ఆహా ఓటీటీలో విడుదల చేయడానికి ట్రై చేస్తున్నారు. ‘వి’ సినిమా కోసం ఇది వరకు చాలా డిజిటల్ సంస్థలు ట్రై చేసినా ఒప్పుకోని దిల్‌రాజు మ‌రి అర‌వింద్ మాట వింటారా? అనేది చూడాలి.

More News

ఆస‌క్తిక‌ర‌మైన పాత్ర‌లో కీర్తి..?

‘మ‌హాన‌టి’తో జాతీయ అవార్డు ద‌క్కించుకున్న కీర్తిసురేశ్ ఒక ప‌క్క మ‌హిళా ప్ర‌ధాన‌మైన చిత్రాల‌తో పాటు, స్టార్ హీరో సినిమాల్లో న‌టిస్తూ మెప్పించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

సినిమా అనేది ఒక ఎమోషన్ - ఎన్ని కొత్త టెక్నాలిజీలు వచ్చినా, సినిమా ఆగిపోదు - నిర్మాత ఎస్ కే యెన్

టాక్సీ వాలా సినిమా తో నిర్మాతగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని, ప్రతి రోజు పండగే వంటి మరో బ్లాక్ బస్టర్ సినిమాకి సహ నిర్మాతగా వ్యవహరించిన ప్రముఖ నిర్మాత ఎస్ కే యెన్

చిరుతో రౌడీ హీరో..!

మెగాస్టార్ చిరంజీవి, ఇప్పుడిప్పుడే యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న క్రేజీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ క‌లిసి ప‌నిచేయ‌నున్నారా?

గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుంది: శాస్త్రవేత్తల బృందం

కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి దిశగా పయనిస్తోందనే భయానక నిజాన్ని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ గురించి బ్యాడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

ఆగస్ట్ 15 నాటికి కోవిడ్ వ్యాక్సిన్ వచ్చేస్తుంది... ఇంకేమంది.. మనమంతా సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోతామని భావిస్తున్న వారందరికీ కేంద్ర శాస్త్ర సాంకేతికశాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది.