close
Choose your channels

అరణ్యంలో ట్రైలర్ విడుదల

Saturday, August 6, 2016 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
రోషిత్, షాలు, చరణ్ నాయుడు, కరుణాకర్, కళ్యాణి ముఖ్య పాత్రల్లో .. సుదర్శన్ రెడ్డి పాల్వాయి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అరణ్యంలో...వన్ మన్ క్రియేషన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్ జరుపుకుంటుంది. త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో జరిగింది.
అనంతరం దర్శక నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... ఇది నా తొలి చిత్రం. నేను ఫ్యాషన్ డిసైన్ రంగంలో ఉన్నాను, సినిమా పై ఉన్న‌ ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చాను. ఇక ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే .. సివిలైజేషన్ అంటే కేవలం మనుషుల బట్టల్లో మార్పులు రావడం కాదు ఏ కాలంలో అయినా మహిళలను గౌరవించాలని చెప్పే కథ ఇది . అలాగని మెసేజ్ ఇచ్చేలా ఉండదు. ఈ సినిమా మొత్తం హైద‌రాబాద్ చుట్టుపక్కల షూట్ చేసాం. ఇక్కడ దగ్గరున్న అడవుల్లో దాదాపు 60 రోజులు పాటు షూటింగ్ జరిపాం. అన్ని రకాల కమర్షియల్ అంశాలు ఉన్న ఈ సినిమా సస్పెన్స్ తో కూడుకున్న ఎంటర్ టైనర్ అని చెప్పాలి.
అలాగే ఇటీవలే విడుదలైన ఆడియో కి మంచి స్పందన లభించింది, మధుర ద్వారా పాటలను విడుదల చేసాం. ఈ చిత్రానికి మా అన్నయ్య గారి అబ్బాయి సంతోష్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించాడు. అజయ్ పట్నాయక్ ఇచ్చిన మ్యూజిక్, రీ రీకార్డింగ్ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయి. కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే సినిమా ఇది.త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఈ నెల చివరి వారంలో విడుదల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమా తరువాత దీనికి సీక్వెల్ గా అరణ్యం 2 చిత్రం ఉంటుంది అన్నారు.
చరణ్ నాయుడు మాట్లాడుతూ .. మంచి కథతో తెరకెక్కన చిత్రమిది. ఇందులో మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన సుదర్శన్ రెడ్డి కి థాంక్స్ అన్నారు.
హీరోయిన్ షాలు మాట్లాడూతూ .. ప్రస్తుత ట్రెండ్ కి తగ్గట్టుగా మంచి కథతో దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో నాకు మంచి అవకాశం ఇచ్చిన‌ దర్శకుడు సుదర్శన్ రెడ్డి గారికి థాంక్స్ అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం : అజయ్ పట్నాయక్, కథ : భరత్ పల్లపోలు, కెమెరా : సంతోష్ రెడ్డి పాల్వాయి, నిర్మాత , దర్శకత్వం : సుదర్శన్ రెడ్డి పాల్వాయి .

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.   

Comments

Welcome to IndiaGlitz comments! Please keep conversations courteous and relevant to the topic. To ensure productive and respectful discussions, you may see comments from our Community Managers, marked with an "IndiaGlitz Staff" label. For more details, refer to our community guidelines.
settings
Login to post comment
Cancel
Comment