'చంద్రకళ' సీక్వెల్ హక్కులు దక్కించుకున్న సర్వంత్రామ్ క్రియేషన్స్ ,గుడ్ సినిమా గ్రూప్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తమిళంలో ఆరణ్మనిగా... తెలుగులో చంద్రకళగా ఆ మధ్య విడుదలై సంచలనం విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చంద్రకళ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందింది. ఈ చిత్ర తెలుగు హక్కుల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. పలువురు తెలుగు చిత్ర నిర్మాతలు చంద్రకళ సీక్వెల్ హక్కులు పొందేందుకు ట్రై చేశారు. కానీ ఫ్యాన్సీ రేట్ ఇచ్చి సర్వంత్రామ్ క్రియేషన్స్ మరియు ఈరోజుల్లో, రోమాన్స్ లాంటి పలు విజయవంతమైన చిత్రాల్ని అందించిన గుడ్ సినిమా గ్రూప్ దక్కించుకున్నారు.
ఈ రెండు బ్యానర్స్ సంయుక్తంగా చంద్రకళ సీక్వెల్ ను త్వరలోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. శ్రీ జవ్వాజి రామాంజనేయులు చిత్ర సమర్పకులు, చంద్ర కళ సీక్వెల్ లో సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక మోత్వాని, పూనమ్ బాజ్వా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. హార్రర్ కామెడీ జోనర్ లో తెరకెక్కించిన ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. హిప్ హాప్ తమీఝా సంగీతమందించారు.
చంద్రకళ తెలుగు సీక్వెల్ హక్కులు పొందిన సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... చంద్రకళ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం హార్రర్ కామెడీ చిత్రాల్లోనే బాక్సాఫీస్ ను షేక్ చేసిన చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో రికార్డులు సృష్టించింది. అదే చిత్రానికి సీక్వెల్ ను సైతం ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు దర్శకుడు సుందర్ సి. అలాంటి సంచలనాత్మక చిత్ర సీక్వెల్ హక్కుల్ని మా సంస్థలైన గుడ్ సినిమా గ్రూప్, సర్వంత్రమ్ క్రేయేషన్స్ దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఈ చిత్రాన్ని సైతం భారీ పబ్లిసిటీతో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే తీసుకురాబోతున్నాం. సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక మోత్వాని, పూనమ్ బాజ్వా పెర్ ఫార్మెన్స్ అద్భుతంగా ఉంటుంది. అద్భుతమైన గ్రాఫిక్స్ తో మెస్మరైజ్ అవుతారు. కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ను దర్శకుడు ఈ చిత్రం ద్వారా అందించబోతున్నారు. హిప్ హాప్ మ్యూజిక్, రీ రికార్డింగ్ ఈ చిత్రానికి మరో ప్రధాన బలం. ఇంకా పేరు పెట్టని ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు.
సమర్పణ - శ్రీ జవ్వాజి రామాంజనేయులు , నటీనటులు - సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక, పూనమ్ బాజ్వా, సూరి, కోవై సరళ, రాధా రవి , సంగీతం - హిప్ హాప్ తమిఝా, దర్శకుడు - సుందర్ సి , నిర్మాత - గుడ్ ఫ్రెండ్స్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout