డిసెంబర్ 2న అరకు రోడ్ లో...!
Wednesday, November 23, 2016 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
రాం శంకర్, నికిషా పటేల్ జంటగా శేషాద్రి క్రియేషన్స్ పతాకంపై రూపొందిన చిత్రం `అరకు రోడ్ లో...వాసుదేవ్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రానికి మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా లు నిర్మాతలు. ఈ చిత్రం నిర్మాణాంతర కార్య క్రమాలన్ని పూర్తి చేసుకుని డిసెంబర్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది .
ఈ సందర్భం గా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ... ఇటీవల మా చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ గారు ,మరియు ఇతర సినీ ప్రముఖులు ప్రసాద్ ల్యాబ్ లో చూడడం జరిగింది . సినిమా చూసివారందరూ మెచ్చుకోవడం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది . అలాగే ప్రభాస్ గారు విడుదల చేసిన సాంగ్ కి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది .30 ఇయర్స్ పృథ్వీ చేసిన రిస్క్ రసూల్ క్యారక్టర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అని చెప్పారు . ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 2 న అత్యధిక ధియేటర్ లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నాం అని అన్నారు .
రాం శంకర్, నికిషా పటేల్, కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, థర్టీ ఇయర్స్ పృథ్వి, కృష్ణ భగవాన్, రఘు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్, సంగీతం : రాహుల్ రాజ్, వాసుదేవ్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జగదీశ్ చీకటి, నిర్మాతలు : మేకా బాలసుబ్రహ్మణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాద రాజు, రామేశ్వరి నక్కా; రచన, దర్శకత్వం : వాసుదేవ్
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments