బ‌న్నీతో రెహ‌మాన్‌?

  • IndiaGlitz, [Monday,October 16 2017]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం నా పేరు సూర్య అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌చ‌యిత వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ చిత్రంలో కేర‌ళ‌కుట్టి అను ఇమ్మానియేల్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌క‌ద్వ‌యం విశాల్ -శేఖ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో బ‌న్నీ ఓ ద్విభాషా చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థం సెట్స్ పైకి వెళ్ల‌నున్న ఈ సినిమాకి డ‌బుల్ ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీత‌మందించ‌నున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అదే నిజ‌మైతే.. మెగా ఫ్యామిలీ హీరోల‌తో రెహ‌మాన్ చేసే మూడో చిత్రం ఇదే అవుతుంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో కొమ‌రం పులి చేసిన రెహ‌మాన్‌.. ప్ర‌స్తుతం చిరంజీవితో సైరా న‌ర‌సింహారెడ్డి చేస్తున్నాడు. మ‌రి ఈ వార్త‌లో ఎంత నిజ‌ముందో త్వ‌ర‌లోనే తెలుస్తుంది.