అతిథి పాత్రలో ఎ.ఆర్.రెహ్మాన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆస్కార్ విజేత ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. దక్షిణాది, ఉత్తరాది సినిమాలే కాదు.. ప్రైవేట్ ఆల్బమ్స్‌తో ప్రేక్షకులను ఊర్రుతలూగించిన సంగీత సామ్రాట్. త్వరలోనే ఆయన కొత్త అవతారంలో మెప్పించనున్నారు. పాటలు, నేపథ్య సంగీతం అంటూ ఉండే రెహ్మాన్ త్వరలోనే నటుడిగా కూడా మెప్పించబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. అంతే కాదండోయ్... ఈ విషయాన్ని మోహన్‌లాల్ కన్ఫర్మ్ చేశారు కూడా. ఇంతకీ ఎ.ఆర్.రెహ్మాన్ నటించబోతున్న చిత్రమేదో తెలుసా.. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ హీరోగా బి.ఉన్నికృష్ణన్ రూపొందిస్తోన్న చిత్రం ఆరాట్టు. అరుదైన ఫొటో, ఎప్పటికీ గుర్తుండిపోతుంది అని పేర్కొన్నారు మోహన్‌లాల్. యాక్షన్, కామెడీ ప్రధానంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తోంది.
రెహ్మాన్ ఇది వరకు ప్రైవేట్ ఆల్బమ్స్ చాలా వాటిలో కనిపించి అభిమానులను అలరించారు. ఇటీవల విజయ్ హీరోగా నటించిన బిగిల్ చిత్రంలోనూ ఓ పాటలో అలా మెరిశారు కూడా. అయితే కేవలం పాటల్లో కాకుండా నటన పరంగా ఎ.ఆర్.రెహ్మాన్ వెండితెరపై ఆరాట్టు చిత్రంతో అలరించబోతున్నారు మరి. అలాగే ఈ మధ్య 99 చిత్రంతో రెహ్మాన్ నిర్మాతగా కూడా మారారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com