'నిర్మల కాన్వెంట్' చిత్రంలో ఎ.ఆర్.రెహమాన్ తనయుడు ఎ.ఆర్.అమీన్ పాట

  • IndiaGlitz, [Thursday,February 11 2016]

కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'నిర్మల కాన్వెంట్‌'. ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రం ద్వారా అస్కార్‌ అవార్డు గ్రహీత ఎ.ఆర్‌.రెహమాన్‌ తనయుడు ఎ.ఆర్‌.అమీన్‌ నేపథ్య గాయకుడుగా పరిచయమవుతున్నారు. కడపలోని అమీన్‌ పీర్‌ దర్గాను అత్యంత భక్తి శ్రద్ధలతో తరచూ దర్శించుకొనే రెహమాన్‌ తన కుమారుడికి అమీన్‌ అనే పేరుని పెట్టుకున్నారు. తండ్రి ప్రోత్సాహంతో సంగీత కళాకారుడుగా ఎదుగుతున్న ఎ.ఆర్‌.అమీన్‌ను 'నిర్మల కాన్వెంట్‌' చిత్రంలో ఓ పాట పాడించి సింగర్‌గా సగర్వంగా పరిచయం చేస్తున్నారు కింగ్‌ నాగార్జున. ఈ పాటను ఫిబ్రవరి 12న విడుదల చేయబోతున్నారు. హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేస్తున్న కింగ్‌ నాగార్జున.. ఎ.ఆర్‌.అమీన్‌ను ఈ చిత్రం ద్వారానే సింగర్‌గా ఇంట్రడ్యూస్‌ చెయ్యడం విశేషం. కింగ్‌ నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రోషన్‌, శ్రేయా శర్మ హీరోహీరోయిన్లు కాగా ఆదిత్య మీనన్‌, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్‌, తాగుబోతు రమేష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రోషన్‌ సాలూరి, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, నిర్మాతలు: అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్‌, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.

More News

రవితేజ నిర్మాత మళ్ళీ మారాడోచ్...

రవితేజ ఏ ముహుర్తాన తన నెక్ట్స్ మూవీ చెయ్యాలనుకుంటున్నాడో కానీ సినిమాకు నిర్మాతలు మారుతూనే ఉన్నారు.రవితేజ నిర్మాతగా వేణుశ్రీరాం నిర్మాతగా సినిమా ఉంటుందని అనౌన్స్ చేశారు.

విలన్ గా రాజశేఖర్...

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా 90దశకంలో వరుస విజయాలను అందుకున్న హీరో డా.రాజశేఖర్.

దిల్ రాజు చేతిలో...

స్టార్ ప్రొడ్యూసర్,డస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు రెండు పెద్ద చిత్రాల నైజాం డిస్ట్రిబ్యూషన్ హక్కులను చేజిక్కించుకున్నాడు.

సందీప్ తో అందాల రాక్షసి...

సందీప్ కిషన్ ఇప్పుడు రెండు సినిమాలు చేస్తున్నాడు.నిత్యామీనన్ తో కలిసి 'ఒక్క అమ్మాయి తప్ప' సినిమా,మరో సినిమాగా మలయాళ ‘నేరం’సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.

తూచ్..అంటున్న సమంత...

హీరోయిన్ సమంత ఇప్పుడు తెలుగు,తమిళ చిత్రాలతో బిజీగా ఉంది.