హీరోగా రెహమాన్ కొడుకు?
- IndiaGlitz, [Friday,June 14 2019]
ఎ.ఆర్.రెహమాన్ తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారా? ఏమో... పరిస్థితులు చూస్తుంటే అతను హీరోగా ఎంట్రీ ఇస్తాడేమోననే అనిపిస్తోంది అని అంటున్నాయి కోడంబాక్కం వర్గాలు.
ఉన్నట్టుండి ఎ.ఆర్.రెహమాన్ తనయుడు అమీన్ ప్రసక్తి ఎందుకు వచ్చిందని పలువురు ఆరా తీస్తున్నారు. దీనంతటికీ కారణం రెహమన్ పెట్టిన పోస్టు. రెహమాన్ ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేసి 'ఇతనెవరో కనిపెట్టారా' అని అడిగారు. అందులో ఓ కుర్రాడు మంచి కలర్‌ఫుల్ జాకెట్ వేసుకుని, దాంతో పాటు కళ్లకు మంచి కళ్లజోడు పెట్టి స్టైలైన హెయిన్ స్టైల్‌తో లైట్ల కాంతిలో ఓ వైపు నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా ఉంది. రెహమాన్ పోస్ట్ చేసిన కాసేపటికే ఆ ఫొటో రెహమాన్ తనయుడిదేనని నెటిజన్లు గుర్తుపట్టారు. అదే విషయాన్ని ఇన్‌బాక్స్ లో పెట్టేశారు. దాంతో రెహమాన్ ఆనందానికి అవధులు లేవు.
ఉన్నట్టుండి తనయుడి స్టైలిష్ లుక్‌ను రెహమాన్ ఎందుకు విడుదల చేసినట్టు? ఈ లుక్ అమీన్ నటించిన ఆల్బమ్ లోదా? లేకుంటే ఏదైనా సినిమాలోదా? అనే అనుమానాల పరంపర మాత్రం కొనసాగుతోంది. దీనికి సంబంధించి కూడా రెహమాన్ స్పందిస్తే బావుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.