మీ టూ పై రెహమాన్ స్పందన...
Send us your feedback to audioarticles@vaarta.com
ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ మీటూ వ్యవహారంపై తన స్పందను తెలియజేశారు. రెరీసెంట్గా వైరముత్తు తదితరులపై మీటూలో లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తన సోదరి రెహానా దగ్గర నుండి విషయాలు తెలుసుకున్న రెహమాన్ హమాన్ ట్విట్టర్ వేదికగా తన స్పందను తెలిపారు.
"మీ టూ ఉద్యమంలో పేర్లు విని షాకయ్యాను. మన చిత్ర పరిశ్రమ క్లీన్‌గా మహిళలను గౌరవించేలా ఉండాలి. బాధితులకు ఆ దేవుడు మరింత శక్తినివ్వాలి. ప్రతి ఒక్కరూ నైపుణ్యం పెంచుకోవడానికి .. విజయాన్ని సాధించడానికి అనువైన వాతావరణాన్ని కల్పించాలి.
మాకు సంబంధించినంత వరకు ... అందరికీ మంచి వాతావరణాన్నికల్పించాలని నేను, నా బృందం నిర్ణయించుకున్నాం. సోషల్ మీడియా స్వేచ్ఛగా మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే కొందరు దీన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి" అంటూ ట్వీట్ చేశారు. దీనికి ప్రతిగా చిన్మయి బాధతో కన్నీరు పెట్టుకుంటున్న ఎమోజీతో రెహమాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com