బాహుబలికి ఎ.ఆర్.రెహమాన్ ప్రశంస..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన విజువల్ వండర్ `బాహుబలి-2` 1500 కోట్ల కలెక్షన్స్‌ను దాటి బాక్సాఫీస్ వద్ద సత్తాను చాటుతుంది. సినిమాను అద్వీతీయం అంటూ సినీ, రాజకీయ ప్రముఖులందరూ అప్రిసియేట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆస్కార్ అవార్డ్ విన్నర్, ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ ఎ.ఆర్.రెహమాన్ కూడా బాహుబలి-2 యూనిట్‌ను అబినందించారు.
ఇప్పుడే బాహుబలి-2 చిత్రాన్ని చెన్నైలో చూశాను. సినిమా రెండు వేల కోట్ల రూపాయలను వసూలు చేయాలి. రాజమౌళి, కీరవాణిగారు సహా ఎంటైర్ యూనిట్ దక్షిణాది సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళారు అని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా యూనిట్‌ను అభినందించారు. రెహమాన్ ట్వీట్‌కు రాజమౌళి స్పందించారు. మీ అప్రిసియేషన్ ట్వీట్ నాకు చాలా స్పెషల్ అని రిప్లై ఇచ్చారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Contact at support@indiaglitz.com