చిరంజీవి సినిమాకి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం!
Tuesday, June 20, 2017 తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com
Send us your feedback to audioarticles@vaarta.com
చిరంజీవి తన 151వ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రను పోషించబోతున్న విషయం తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నటీనటుల, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది.
ఎంతో ప్రతిష్ఠాత్మక నిర్మాణం జరుపుకోనున్న ఈ చిత్రానికి సంబంధించి మరో విశేషమేమిటంటే ఆస్కార్ అవార్డ్స్ గ్రహీత ఎ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడం. దేశభక్తి ప్రధానంగా రూపొందే ఈ చిత్రానికి రెహమాన్ అయితేనే సంగీత పరంగా పూర్తి న్యాయం చెయ్యగలడన్న ఉద్దేశంతో వున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రం కోసం రెహమాన్‌ను రంగంలోకి దించేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే చిరంజీవి, ఎ.ఆర్.రెహమాన్ ఫస్ట్ కాంబినేషన్లో సినిమా రాబోతోందన్నమాట. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments