రెహమాన్ లైవ్ ఫెర్ఫామెన్స్...
Send us your feedback to audioarticles@vaarta.com
సూపర్‌స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న సైంటిఫిక్ ఫిక్షన్ థ్రిల్లర్ '2.0'. రోబో సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎమీజాక్సన్, బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ నటిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 27న దుబాయ్‌లో నిర్వహించనున్న ఆడియో వేడుకను పన్నెండు కోట్ల రూపాయలతో గ్రాండ్ లెవల్లో నిర్వహించనున్నారు.
ఈ వేడుకకు బూర్జ్ కలీఫా భవంతి వేదిక కానుంది. ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ వేడుకలో రెహమాన్ లైవ్ పెర్ఫామెన్స్ ఇవ్వనున్నారట. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను త్రీడీ టెక్నాలజీలో విడుదల చేయబోతున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments