ఇబ్బందుల్లో ఎ.ఆర్‌.రెహ్మాన్‌

  • IndiaGlitz, [Friday,September 11 2020]

ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్‌.రెహ్మాన్ కొత్త స‌మ‌స్య‌ల్లో ప‌డ్డారు. ఈ బాహుభాషా సంగీత ద‌ర్శ‌కుడుకి ట్యాక్స్ ఎగ‌వేత సంబంధిత కేసులో ఐటీశాఖ వేసిన కేసుపై మ‌ద్రాస్ హైకోర్టు ఎ.ఆర్‌.రెహ‌మాన్‌కి నోటీసుల‌ను జారీ చేసింది. ప‌న్ను ఎగ‌వేత‌కు సంబంధించి ఐటీ శాఖాధికారులు వేసిన పిటిష‌న్‌పై వివ‌ర‌ణ ఇవ్వాలంటూ రెహ్మాన్‌కు కోర్టు నోటీసులు ఇచ్చింది. వివ‌రాల మేర‌కు 2012లో బ్రిట‌న్‌కు చెందిన టెలికాం అనే ఓ ప్ర‌వేటు కంపెనీతో ఎ.ఆర్‌.రెహ్మాన్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు.

ఈ ఒప్పందం విలువ రూ.3.47కోట్లు. ఒప్పందం ప్ర‌కారం టెలికాం కంపెనీకి రెహ్మాన్ ఎక్స్‌క్లూజివ్ రింగ్‌టోన్స్ అందిస్తాన‌ని చెప్పారు. చెల్లించాల్సిన మొత్తాన్ని త‌న ఛారిట‌బుల్ ట్ర‌స్ట్ ద్వారా చెల్లించాల‌ని రెహ్మాన్ కంపెనీ ప్ర‌తినిధుల‌ను కోరారు. ఈ మొత్తానికి క‌ట్టాల్సిన ప‌న్నును ఎ.ఆర్.రెహ్మాన్ చెల్లించ‌లేద‌ని ఐటీ శాఖాధికారులు కోర్టులో పిటిస‌న్ వేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్ర‌స్తుతం రెహ్మాన్ త‌న 99 సాంగ్స్ ఆల్బమ్‌తో పాటు కోబ్రా, అయ‌ల‌న్, పొన్నియ‌న్ సెల్వ‌న్‌, మ‌హావీర్ క‌ర్ణ‌, అథ్రంగి రే, ఓ మ‌ల‌యాళ చిత్రం, హిందీ చిత్రాల‌కు సంగీతాన్ని అందిస్తున్నారు.

More News

శంక‌ర్ మ‌రో సీక్వెల్‌కు సిద్ధ‌మ‌య్యాడా?

ఒక‌ప్పుడు సౌత్ ఇండియ‌న్ సినిమా రేంజ్‌ను ప్ర‌పంచానికి చాటిన ద‌ర్శ‌కుల్లో శంక‌ర్ ఒక‌రు.

అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఉత్తర్వులు

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయ రథం ఈ నెల 5న అగ్నికి ఆహుతి అయింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దారితీసింది.

ఆత్మహత్యకు 2 రోజుల ముందు దేవరాజ్‌ను కలిసిన శ్రావణి..

బుల్లితెర నటి ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు..

కంగన చుట్టూ ఉచ్చు బిగిస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం

బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ కంగనా రనౌత్ చుట్టూ మహారాష్ట్ర ప్రభుత్వం ఉచ్చు బిగిస్తోంది.

ఆ విషయంలో ప్రభాస్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేస్తాడా?

ఇంకా ప్రభాస్‌ 'ఆదిపురుష్‌' సినిమా ప్రారంభం కానే లేదు. కానీ అప్పుడే రికార్డుల గురించి మాట్లాడుకోవడం మొదలెట్టేశారు. ఇంతకూ ఆదిపురుష్‌ ఏ విషయంలో రికార్డ్‌ క్రియేట్‌ చేయనుందనే వివరాల్లోకెళ్తే..