ఇబ్బందుల్లో ఎ.ఆర్.రెహ్మాన్
Send us your feedback to audioarticles@vaarta.com
ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్.రెహ్మాన్ కొత్త సమస్యల్లో పడ్డారు. ఈ బాహుభాషా సంగీత దర్శకుడుకి ట్యాక్స్ ఎగవేత సంబంధిత కేసులో ఐటీశాఖ వేసిన కేసుపై మద్రాస్ హైకోర్టు ఎ.ఆర్.రెహమాన్‌కి నోటీసులను జారీ చేసింది. పన్ను ఎగవేతకు సంబంధించి ఐటీ శాఖాధికారులు వేసిన పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ రెహ్మాన్‌కు కోర్టు నోటీసులు ఇచ్చింది. వివరాల మేరకు 2012లో బ్రిటన్‌కు చెందిన టెలికాం అనే ఓ ప్రవేటు కంపెనీతో ఎ.ఆర్.రెహ్మాన్ ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఈ ఒప్పందం విలువ రూ.3.47కోట్లు. ఒప్పందం ప్రకారం టెలికాం కంపెనీకి రెహ్మాన్ ఎక్స్‌క్లూజివ్ రింగ్టోన్స్ అందిస్తానని చెప్పారు. చెల్లించాల్సిన మొత్తాన్ని తన ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా చెల్లించాలని రెహ్మాన్ కంపెనీ ప్రతినిధులను కోరారు. ఈ మొత్తానికి కట్టాల్సిన పన్నును ఎ.ఆర్.రెహ్మాన్ చెల్లించలేదని ఐటీ శాఖాధికారులు కోర్టులో పిటిసన్ వేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రెహ్మాన్ తన 99 సాంగ్స్ ఆల్బమ్‌తో పాటు కోబ్రా, అయలన్, పొన్నియన్ సెల్వన్, మహావీర్ కర్ణ, అథ్రంగి రే, ఓ మలయాళ చిత్రం, హిందీ చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com