సైరాకి రెహ‌మాన్ అంత డిమాండ్ చేశారా?

  • IndiaGlitz, [Tuesday,December 19 2017]

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తున్న 151వ చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. స్వాతంత్ర్య స‌మ‌రయోధుడు ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి జీవితం ఆధారంగా.. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమాని రామ్ చ‌రణ్ నిర్మిస్తున్నాడు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌కుడు. ఇటీవ‌లే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. ఇదిలా ఉంటే.. తొలుత ఈ సినిమాకి ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.రెహ‌మాన్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా ఎంపికైన సంగ‌తి తెలిసిందే.

అయితే బిజీ షెడ్యూల్స్ కార‌ణంగా ఆయ‌న ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నారు. ఇదే విష‌యం రెహ‌మాన్ కూడా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే వాస్త‌వం మ‌రోలా ఉంద‌ట‌. ఇంత‌కీ అదేమిటంటే.. ఈ సినిమాకి రెహ‌మాన్ అక్ష‌రాలా రూ.ప‌ది కోట్ల పారితోషికం అడిగార‌ట‌. దాంతో.. సైరా యూనిట్ ఆలోచ‌న‌లో ప‌డింద‌ట‌.

రెమ్యూన‌రేష‌న్ విష‌యంలో రాజీప‌డ‌ని రెహ‌మాన్ ప్రాజెక్ట్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చార‌ని టాలీవుడ్‌లో వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విష‌యంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి స్పంద‌న లేదు. తాజాగా వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఈ సినిమాకి సంగీత ద‌ర్శ‌కుడిగా కీర‌వాణి పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది.

More News

విజ‌య్‌, స‌మంత.. ఒకే త‌ర‌హా పాత్ర‌ల్లో..

మ‌హాన‌టి సావిత్రి జీవితంలోని ముఖ్య కోణాల్ని స్పృశిస్తూ తెర‌కెక్కిస్తున్న చిత్రం మ‌హాన‌టి. న‌డిగ‌ర్ తిల‌గ‌మ్ పేరుతో త‌మిళంలోనూ ఈ సినిమా తెర‌కెక్కుతోంది.

దిల్ రాజు సినిమాల్లో ఈ సారి మిస్సింగ్ అదే

దిల్ రాజు సంస్థ నుంచి ఓ సినిమా వస్తుందంటే..

గ‌జ‌దొంగ బ‌యోపిక్‌ పై...

ఇప్పుడు ఇండియ‌న్ సినిమాల్లో బ‌యోపిక్‌ల హ‌వా పెరుగుతుంది. తెలుగులో అబ్దుల్ క‌లామ్‌, ఎన్టీఆర్‌, కె.సి.ఆర్‌, చిరంజీవి ....జీవిత చరిత్ర‌లు సినిమాల రూపంలో రానున్నాయి.

బాలీవుడ్ నిర్మాణ సంస్థకి నో చెప్పిన విజయ్

పెళ్ళి చూపులుతో కథానాయకుడిగా తొలి విజయాన్ని అందుకున్నాడు విజయ్ దేవరకొండ.

శ్రియ.. డబుల్ ధమాకా

పదహారేళ్లుగా కథానాయికగా రాణిస్తోంది ఢిల్లీ డాళ్ శ్రియా శరన్.