సైరాకి రెహమాన్ అంత డిమాండ్ చేశారా?
Send us your feedback to audioarticles@vaarta.com
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా.. ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకుడు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ఇదిలా ఉంటే.. తొలుత ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే.
అయితే బిజీ షెడ్యూల్స్ కారణంగా ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నారు. ఇదే విషయం రెహమాన్ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే వాస్తవం మరోలా ఉందట. ఇంతకీ అదేమిటంటే.. ఈ సినిమాకి రెహమాన్ అక్షరాలా రూ.పది కోట్ల పారితోషికం అడిగారట. దాంతో.. సైరా యూనిట్ ఆలోచనలో పడిందట.
రెమ్యూనరేషన్ విషయంలో రాజీపడని రెహమాన్ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చారని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి స్పందన లేదు. తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం.. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా కీరవాణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments