పుస్త‌క రూపంలో రెహ‌మాన్ బ‌యోగ్ర‌ఫీ

  • IndiaGlitz, [Thursday,June 14 2018]

ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ గురించి నేటి కాలం సంగీత ప్రియుల్లో తెలియ‌ని వారుండ‌రు. సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించి నేను అంత‌ర్జాతీయ మ్యూజిషియ‌న్ రేంజ్‌కు రెహ‌మాన్ ఎదిగారు. అంతే కాకుండా రెండు ఆస్కార్ అవార్డుల‌ను సొంతం చేసుకుని భార‌తీయ సినిమాకు గ‌ర్వ‌కార‌ణంగా నిలిచారు.

ఇలాంటి వ్య‌క్తి ఇన్‌స్పైరింగ్ జీవితం పుస్త‌క రూపంలో వెలువ‌డ‌నుంది. 'నోట్స్ ఆఫ్ ఎ డ్రీమ్‌' అనే పేరుతో చెన్నైకి చెందిన కృష్ణ త్రిలోక్ రెహ‌మాన్ బ‌యోపిక్‌ను రాస్తున్నారు. ఈ పుస్త‌కం ఆగ‌స్టులో విడుద‌ల కానుంది. ఇలాంటి ఇన్‌స్పైరింగ్ పుస్త‌కాన్ని రాయ‌డం గొప్ప‌గా ఉంద‌ని కృష్ణ త్రిలోక్ తెలిపారు.