ఎ.ఆర్.రెహమాన్‌కి కోపమొచ్చింది
Send us your feedback to audioarticles@vaarta.com
ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతమే ప్రపంచంగా ఉంటారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు ఆయన సందర్భానుసారం మెసేజ్‌లను పోస్ట్ చేస్తుంటారు. తన పనేదో తనది అన్నట్లుండే రెహమాన్‌కి కోపమొచ్చింది. ఇంతకు ఆయనకు కోపమొందుకొచ్చిది?.. వివరాల్లోకెళ్తే.. సాధారణంగా ఎ.ఆర్.రెహమాన్‌కి పాటలను రీమేక్స్ చేయడమంటే మా చెడ్డ చిరాకు. ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు కూడా. తాజాగా తన పాటను ఓ మ్యూజిక్ కంపెనీ రీమిక్స్ చేయడంతో రెహమాన్ కోపం నషాళానికి అంటింది.
అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్‌లు కలిసి నటించిన చిత్రం ఢిల్లీ 6. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఆ సినిమాలో మసక్కలి పాట చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పుడు మసక్కలి 2.0 అనే పేరుతో రీమిక్స్ పాటలను విడుదల చేశారట. దాంతో చిర్రెత్తుకొచ్చిన రెహమాన్ ‘‘మసక్కలి పాట ఎందరో కష్టం, క్రియేటివిటీ వల్ల పుట్టింది. దాన్ని ఇలా ఖూనీ చేస్తారా?’’ అంటూ ఒరిజినల్ సాంగ్‌ను, రీమిక్స్ సాంగ్‌ను పోస్ట్ చేశారు. రెహమాన్‌కు నెటిజన్స్ నుండే కాదు. పలువురు సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ నుండి కూడా మద్దతు దొరుకుతుంది.
Enjoy the original #Masakali https://t.co/WSKkFZEMB4@RakeyshOmMehra @prasoonjoshi_ @_MohitChauhan pic.twitter.com/9aigZaW2Ac
— A.R.Rahman (@arrahman) April 8, 2020
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments