'మెట్రో' గ్రిప్పింగ్ ఆద్యంతం ఉత్కంఠతో ఆకట్టుకుంటుంది - ఏ.ఆర్.మురుగదాస్
- IndiaGlitz, [Wednesday,December 21 2016]
ప్రేమిస్తే, జర్నీ, పిజ్జా వంటి బ్లాక్‌బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో ఆర్ 4 ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కిన సినిమా -'మెట్రో'. రజని తాళ్లూరి నిర్మాత. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న చైన్ స్నాచింగ్‌లను కళ్ళకు కడుతూ.. తెరకెక్కించిన చిత్రమిది. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్‌కి, పోస్టర్లకు చక్కని స్పందన వచ్చింది. ప్రఖ్యాత గాయని గీతామాధురి ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సౌత్ స్టార్ డైరెక్టర్ గౌతమ్‌మీనన్ తనదైన శైలిలో కితాబిచ్చారు. ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తించే చిత్రమిదని ప్రశంసల జల్లులు కురిపించారు.
లేటెస్టుగా మరో స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్.మురుగదాస్ ప్రశంసలు 'మెట్రో' సినిమాకి దక్కాయి. మెట్రో ట్రైలర్ చూసిన మురుగదాస్ .. ఈ సినిమా తెలుగులో పెద్ద విజయం సాధిస్తుందని అన్నారు. చిత్రయూనిట్‌కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈరోస్ ఇంటర్నేషనల్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ తమిళ్‌లో నిర్మించింది. చూస్తున్నంతసేపూ రోమాంచితంగా ఉంటుంది. ఉత్కంఠతో ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలెన్నో ఉంటాయి. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కింది. ట్రైలర్ నైస్'' అంటూ ప్రశంసలు కురిపించారు. ఏ.ఆర్.మురుగదాస్ నిర్మించిన 'ఎంగేయుమ్ ఎప్పోదుమ్' చిత్రాన్ని తెలుగులో 'జర్నీ' పేరుతో నిర్మాత సురేష్ కొండేటి అందించిన సంగతి తెలిసిందే. జర్నీ తెలుగులో సంచలన విజయం సాధించింది. మళ్లీ ఇప్పుడు అదే నిర్మాత సమర్పకుడిగా 'మెట్రో' ఈనెల 30 రిలీజ్‌కి వస్తోంది. రియలిస్టిక్ ఇన్సిడెంట్లతో నేచురల్ పంథాలో తెరకెక్కిన 'మెట్రో' 'జర్నీ'ని మించి బ్లాక్‌బస్టర్ సాధిస్తుందన్న అంచనాలేర్పడ్డాయి.
ఈ సందర్భంగా నిర్మాత రజని తాళ్లూరి మాట్లాడుతూ -''తెలుగు అనువాదం నాణ్యంగా చేశాం. సాహితి చక్కని మాటలు-పాటలు అందించారు. సినిమా చూస్తున్నంత సేపూ తెలుగు స్ట్రెయిట్ సినిమా చూస్తున్నట్టే ఉంటుంది. గౌతమ్‌మీనన్, అలాగే ఏ.ఆర్.మురుగదాస్ అంతటి ప్రముఖులు మా సినిమాని ప్రశంసించడం ఆనందాన్నిచ్చింది. తొలి కాపీ సిద్ధంగా ఉంది. ఈనెల 30న రిలీజ్ చేస్తున్నాం'' అన్నారు.
సమర్పకుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -''చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో అద్భుతమైన భావోద్వేగాలతో సాగే చిత్రమిది. గౌతమ్ మీనన్ ప్రశంస తర్వాత ట్రైలర్ చూసి ఏ.ఆర్.మురుగదాస్ అభినందించడం మరింత ఉత్సాహాన్నిచ్చింది. మురుగదాస్ నిర్మించిన 'ఎంగేయుమ్ ఎప్పోదుమ్' చిత్రాన్ని తెలుగులో 'జర్నీ' పేరుతో అందించి విజయం అందుకున్నాం. ఇప్పుడు ఆయన ప్రశంస పొందిన 'మెట్రో' అంతకుమించి విజయం సాధిస్తుందన్న ధీమా ఉంది. తెలుగు ఆడియెన్‌కి ఓ ప్రామిస్సింగ్ సినిమాని అందిస్తున్నాం'' అన్నారు.