14న అత్యంత భారీ స్థాయిలో 'ఆక్వామేన్'
Send us your feedback to audioarticles@vaarta.com
జేసన్ మమోవా, అంబర్ హియర్డ్ కలిసి నటించిన చిత్రం 'అక్వామేన్' . జేమ్స్ వాన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. యాక్షన్ ప్యాక్డ్ అడ్వంచరస్ చిత్రమిది. జేసన్ మమోవా టైటిల్ రోల్‌లో కనిపిస్తారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.
జేసన్ ఫ్రెండ్ మేర పాత్రలో అంబర్ కనిపిస్తారు. తన కోస్టార్ గురించి మమోవా మాట్లాడుతూ "అంబర్ అమేజింగ్ వ్యక్తి. సినిమా షూటింగ్ జరుగుతున్నంత సేపు మేం సరదాగా ఉన్నాం. చాలా ఫన్ అనిపించింది. మా ఇద్దరి పాత్రలూ చాలా బావుంటాయి. మేరా పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది" అని అన్నారు.
ఈ సినిమాను డిసెంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. యు.ఎస్.కన్నా ఒక వారం ముందుగా ఇండియాలో ఇంగ్లిష్, హిందీ, తమిళ్, తెలుగులో విడుదల కానుంది. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ త్రీడీలోనూ, ఐమాక్స్ త్రీడీలోనూ విడుదల చేయనుంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Bala Vignesh
Contact at support@indiaglitz.com