పవన్, రానా మూవీకి బాగా సెట్ అయ్యే టైటిల్.. వైరల్

  • IndiaGlitz, [Sunday,July 04 2021]

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆరడుగుల ఆజానుబాహుడు రానా దగ్గుబాటి కలసి నటిస్తున్న మాస్ మల్టీస్టారర్ చిత్రం సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మలయాళీ బ్లాక్ బస్టర్ అయ్యప్పన్ కోషియం రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ నెల రెండవ వారం నుంచి ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ చిత్ర షూటింగ్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. షూటింగ్ సగభాగం పూర్తయినప్పటికీ ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. దీనితో పవన్, రానా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. ఇద్దరు క్రేజీ హీరోలు పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్న చిత్రం కావడంతో ఎలాంటి టైటిల్ పెడతారనే ఉత్కంఠ నెలకొని ఉంది.

ఇదీ చదవండి: యూట్యూబ్ ని ఊపేసే పాట.. బిగ్ బాస్ దివి హాట్ నెస్ అదుర్స్

ఇప్పటికే బిల్లా రంగ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ టైటిల్ లో మాస్ సౌండింగ్ లేదనేది కొందరు అభిమానుల అభిప్రాయం. తాజాగా దర్శకుడు సాగర్ చంద్ర మరో పవర్ ఫుల్ టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు అందుతున్నాయి. ఈ చిత్రానికి 'పరశురామ కృష్ణమూర్తి' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్. పవన్, రానా ఇమేజ్ ని బట్టి ఈ టైటిల్ అయితే బాగా సెట్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మరి సాగర్ చంద్ర ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో చూడాలి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్ అందిస్తున్నారు.

More News

యూట్యూబ్ ని ఊపేసే పాట.. బిగ్ బాస్ దివి హాట్ నెస్ అదుర్స్

తన గ్లామర్, ట్రెండీ అప్పియరెన్స్ తో క్రమంగా క్రేజ్ పెంచుకుంటోంది బిగ్ బాస్ దివి.

నేను గర్భవతిని కాదు.. ఆ ఫోటోస్ చూసి వీడియోలు చేస్తున్నారు!

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది చిన్మయి.

షాకింగ్: పెళ్లి రద్దు చేసుకుని బిష్ణోయ్ తో విడిపోయిన మెహ్రీన్

బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్, కిరణ్ రావు ల విడాకుల వార్త విన్న కాసేపటికే మరో షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

'మా' ఎన్నికలు: బీజేపీదే అధికారం.. సీవీఎల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సీవీఎల్ నరసింహారావు 'మా'ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

హాట్ ఫోటోస్: దివి నుంచి దిగివచ్చిన దేవతలా పాయల్ హొయలు

పంజాబీ భామ పాయల్ రాజ్ పుత్ ఆర్ఎక్స్ 100 చిత్రంలో బోల్డ్ రోల్ తో యువతలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.