వృద్ధులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఆర్టీసీలో 60 ఏళ్లు దాటిన వారికి డిస్కౌంట్ : పేర్ని నాని ప్రకటన
Send us your feedback to audioarticles@vaarta.com
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ దృష్ట్యా 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆర్టీసీ నిలిపివేసిన 25 శాతం రాయితీని పునరుద్ధరిస్తున్నట్టు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. వయసు నిర్ధారణకు సంబంధించి ఆధార్, ఓటరు ఐడీ లాంటి ఏదైనా గుర్తింపు కార్డు చూపించి రాయితీ పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో మాదిరే ఆర్టీసీలోనూ కారుణ్య నియామకాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్ని నాని వెల్లడించారు. 1800లకు పైగా కారుణ్య నియామకాలను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మిగిలిన శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని మంత్రి చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ తదితర సేవింగ్స్ గతంలో ఆర్టీసీ యాజమాన్యం వాడుకుందని.. వాటిని అన్నింటినీ చెల్లించామని పేర్ని నాని వెల్లడించారు.
ఆర్టీసీ బస్సుల కోసం ఆయిల్ కంపెనీల నుంచి నెలకు 8 లక్షల లీటర్ల డీజిల్ వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. చమురు కంపెనీల నుంచి కొనుగోలు చేసే డీజిల్ ధరలో మార్పులు వచ్చాయని తెలిపారు. గతంలో రూ.15 వరకు తేడా ఉండేదని, ఇప్పుడు బయటి బంకుల్లోనే తక్కువ ధరకు దొరుకుతుందని మంత్రి పేర్కొన్నారు. దీనివల్లే బయటి బంకుల్లో డీజిల్ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్ని నాని వెల్లడించారు. దీనివల్ల ఆర్టీసీకి రోజుకు రూ.1.50 కోట్లు, నెలకు రూ.33.83 కోట్లు ఆదా అయ్యిందని మంత్రి వివరించారు. తిరుమల ఘాట్‌రోడ్డు, తిరుపతి నుంచి నెల్లూరు, తిరుపతి, మదనపల్లికి మొదట ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతామని పేర్ని నాని చెప్పారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments