వృద్ధులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఆర్టీసీలో 60 ఏళ్లు దాటిన వారికి డిస్కౌంట్ : పేర్ని నాని ప్రకటన

  • IndiaGlitz, [Wednesday,March 16 2022]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్‌ దృష్ట్యా 60 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆర్టీసీ నిలిపివేసిన 25 శాతం రాయితీని పునరుద్ధరిస్తున్నట్టు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. వయసు నిర్ధారణకు సంబంధించి ఆధార్‌, ఓటరు ఐడీ లాంటి ఏదైనా గుర్తింపు కార్డు చూపించి రాయితీ పొందవచ్చని మంత్రి పేర్కొన్నారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో మాదిరే ఆర్టీసీలోనూ కారుణ్య నియామకాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్ని నాని వెల్లడించారు. 1800లకు పైగా కారుణ్య నియామకాలను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మిగిలిన శాఖల్లో ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు ఇచ్చారని మంత్రి చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ తదితర సేవింగ్స్ గతంలో ఆర్టీసీ యాజమాన్యం వాడుకుందని.. వాటిని అన్నింటినీ చెల్లించామని పేర్ని నాని వెల్లడించారు.

ఆర్టీసీ బస్సుల కోసం ఆయిల్‌ కంపెనీల నుంచి నెలకు 8 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తున్నట్టు పేర్కొన్నారు. చమురు కంపెనీల నుంచి కొనుగోలు చేసే డీజిల్ ధరలో మార్పులు వచ్చాయని తెలిపారు. గతంలో రూ.15 వరకు తేడా ఉండేదని, ఇప్పుడు బయటి బంకుల్లోనే తక్కువ ధరకు దొరుకుతుందని మంత్రి పేర్కొన్నారు. దీనివల్లే బయటి బంకుల్లో డీజిల్‌ కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్ని నాని వెల్లడించారు. దీనివల్ల ఆర్టీసీకి రోజుకు రూ.1.50 కోట్లు, నెలకు రూ.33.83 కోట్లు ఆదా అయ్యిందని మంత్రి వివరించారు. తిరుమల ఘాట్‌రోడ్డు, తిరుపతి నుంచి నెల్లూరు, తిరుపతి, మదనపల్లికి మొదట ఎలక్ట్రిక్‌ బస్సులు తిప్పుతామని పేర్ని నాని చెప్పారు.

More News

పంజాబ్ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్ మన్ ప్రమాణ స్వీకారం.. పసుపు వర్ణమైన ఖట్కర్ కలన్

పంజాబ్‌ నూతన ముఖ్యమంత్రిగా భగవంత్‌ మన్‌ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.

బెల్లంకొండ సురేష్.. శరణ్‌ల వివాదానికి శుభంకార్డ్: కేసు వాపసు, ఆపై క్షమాపణలు

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌, ఆయన తనయుడు సాయిశ్రీనివాస్‌కు ఫైనాన్షియర్‌ శరణ్ కుమార్‌ క్షమాపణలు తెలిపారు.

జగనన్న విద్యాదీవెన... విద్యార్ధుల తల్లుల ఖాతాల్లోకి రూ.709 కోట్లు జమ చేసిన జగన్

‘జగనన్న విద్యాదీవెన’ పథకం నగదును తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌..

కోవిడ్‌పై పోరు.. ఇవాళ్టీ నుంచి 12-14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్

కోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో భారతదేశం మరో ముందడుగు వేసింది.

కాంగ్రెస్‌లో ప్రక్షాళన షురూ... 5 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు రాజీనామా చేయాలని సోనియా ఆదేశం

5 రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ నిద్రలేచింది. ఈ మేరకు పార్టీ ప్రక్షాళనకు ఉపక్రమించింది.