ఏప్రిల్ 29న విడుదలకు 'జీలకర్ర బెల్లం' రెడీ
Send us your feedback to audioarticles@vaarta.com
అభిజిత్, రేష్మ జంటగా శ్రీ చరణ్ కార్తికేయ మూవీస్ పతాకంపై విజయ్ శ్రీనివాస్ దర్శకత్వంలో శోభారాణి, నౌరోజీ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'జీలకర్ర బెల్లం'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఏప్రిల్ 29న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా..
నిర్మాత నౌరోజీ రెడ్డి మాట్లాడుతూ.. `వందేమాతరం శ్రీనివాస్ గారు అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాలో అన్నీ ఎలిమెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం యువత ఫేస్ చేస్తున్న ప్రదాన అంశమే ఈ కథ. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. విడాకులు కూడా వెంటనే తీసేసుకుంటున్నారు. మంచి చదువు, సంపాదన ఉండటంతో తల్లిదండ్రులు కూడా అడగలేని పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి ఓ సిచ్చువేషన్ కు మెసేజ్ ను యాడ్ చేసి నిర్మించిన చిత్రమే ఇది. కామెడీ, క్రైమ్, రొమాన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి. మంచి సందేశాత్మక చిత్రం. ఈ నెల 29న తెలుగుతో పాటు, కర్నాటకలో కూడా సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు.
కొమ్మనాపల్లి గణపతిరావు మాట్లాడుతూ .. ''నవలా రచయితగా, సినిమా రచయితగా పాపులర్ అయిన తరువాత సీరియల్స్ తో బిజీ అయిపోయాను. గోవిందా గోవిందా సినిమా తరువాత నేను డైలాగ్స్ రాసిన సినిమా ఇదే. ఇది కొత్త కథ కాదు .. ప్రతి ఇంట్లో జరిగే కథ. కొత్తగా ప్రెజంట్ చేయడానికి ప్రయత్నించాం'' అని చెప్పారు.
అభిజీత్ మాట్లాడుతూ.. `ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట మధ్య ఈగో వల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి. చివరకు ప్రేమ గెలిచిందా, ఈగో గెలిచిందా అనేదే సినిమా. సినిమా పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియోలానే సినిమాను కూడా హిట్ చేస్తారని భావిస్తున్నాను. ఏప్రిల్ 29న సినిమా రిలీజ్ అవుతోంది'' అని చెప్పారు.
రేష్మ మాట్లాడుతూ.. ''ఎంటర్టైన్మెంట్ తో పాటు సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంటుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న సినిమా. ఈ సినిమాతో నిర్మాతలకు లాభాలు రావాలి'' అని చెప్పారు.
అభిజీత్, రేష్మ, సుహాసిని మణిరత్నం, రఘుబాబు, తాగుబోతు రమేష్, సూర్య, ఉత్తేజ్, తదితరులు నటించిన ఈ చిత్రానికి...స్క్రీన్ ప్లే, డైలాగ్స్: కొమ్మనాపల్లి గణపతి రావు, ఎడిటింగ్: నందమూరి హరి, సినిమాటోగ్రఫీ: చిట్టిబాబు, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, పాటలు: రామ్ కిరణ్, కరుణాకర్, వెనిగళ్ళ రాంబాబు, వెంకట్రావు కొంపెల్ల, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై. శ్రీనివాస్, నిర్మాతలు: ఎ.శోభారాణి, ఆళ్ళ నౌరోజీ రెడ్డి, దర్శకత్వం: విజయ్ శ్రీనివాస్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Contact at support@indiaglitz.com
Comments