సెప్టెంబర్ 18న 'అప్పుడలా ఇప్పుడిలా' ఆడియో

  • IndiaGlitz, [Tuesday,September 08 2015]

సూర్యతేజ, హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం అప్పుడలా ఇప్పుడిలా'. కె.ఆర్.విష్ణు దర్శకుడు. ప్రదీప్ కుమార్ జంపా నిర్మాత. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని సెప్టెంబర్ 18న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా...

నిర్మాత ప్రదీప్ కుమార్ జంపా మాట్లాడుతూ 'మా బ్యానర్ కి మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది. డైరెక్టర్ విష్ణు ప్రతి సన్నివేశాన్ని బాగా డిజైన్ చేశారు. బ్రహ్మారెడ్డిగారు మంచి కథను అందించారు. ఇటీవల విడదల చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సునీల్ కశ్యప్ గారు అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తాయి. సెప్టెంబర్ 18న తాజ్ దక్కన్ లో సినిమా ఆడియో కార్యక్రమాన్ని సినీ ప్రముఖుల సమక్షంలో నిర్వహిస్తున్నాం. అలాగే త్వరలోనే సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు కె.ఆర్.విష్ణు మాట్లాడుతూ 'ఈ సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చిన ప్రదీప్ గారికి థాంక్స్. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 18న పాటలను విడుదల చేస్తున్నాం. సుమన్, నరేష్, సూర్యతేజ, హర్షికి సహా ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నిషియన్ బాగా సపోర్ట్ చేశారు, అందరికీ థాంక్స్'' అన్నారు.

సుమన్, నరేష్, సుధ, సంగీత, శివారెడ్డి, పృథ్వీ, సుప్రీత్, ప్రభాష్ శ్రీను, వేణు, సుడిగాలి సుధీర్, ఫిష్ వెంకట్, జోష్ రవి, అనంత్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి డ్యాన్స్: రాకేష్, శేఖర్, భాను, కథ: బ్రహ్మారెడ్డి కమతం, మాటలు: పానుగంటి జయంత్, పాటలు: చిర్రావూరి విజయ్ కుమార్, చైతన్యవర్మ, ఆర్ట్: గోవింద్, ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్, సినిమాటోగ్రఫీ: పి.సి.ఖన్నా, సంగీతం: సునీల్ కశ్యఫ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : బిక్షపతి తుమ్మల, నిర్మాత: ప్రదీప్ కుమార్ జంపా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఆర్.విష్ణు.

More News

ఐదు భాషల్లో...తెలుగులో రామ్ చరణ్ చేస్తున్నాడా..?

ఇటీవల తమిళంలో జయం రవి, నయనతార హీరో హీరోయిన్లుగా మోహన్ రాజా దర్శకత్వంలో విడుదలైన చిత్రం ‘తని ఒరువన్’(ఒకే ఒక్కడు అనే అర్థం వస్తుంది).

బ‌న్ని బాగానే ఉన్నాడంటున్న అల్లు అర‌వింద్..

బ‌న్నికి యాక్సిడెంట్ అయ్యింది. ఇది టుడే లేటెస్ట్ పుకారు. ఇంకేముంది బ‌న్నికి యాక్సిడెంట్ జ‌రిగింద‌ట అంటూ న్యూస్ ఛాన‌ల్స్ లో ఒక‌టే హ‌డావిడి.

గణేషుడి ఎదుట బాలయ్య పాట...

నందమూరి నట సింహాం బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం డిక్టేటర్.ఈ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు.

బన్నికి యాక్సిడెంట్ అయ్యిందా...?

బన్ని... బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

ప్లాప్ దర్శకుడితో రవితేజ...?

మాస్ మహారాజా రవితేజ..చాలా మంది కొత్త దర్శకులకు సపోర్ట్ చేసే హీరోల్లో ఒకడు. తనకి కథ నచ్చితే చాలు. కొత్త దర్శకుడా, ప్లాప్ దర్శకుడా అని చూడకుండా సినిమా చేయడానికి రెడీ అయిపోతాడు.