సెప్టెంబర్ 12న 'అప్పుడలా ఇప్పుడిలా' ఆడియో విడుదల

  • IndiaGlitz, [Saturday,August 22 2015]

సూర్యతేజ, హర్షికి పూనాచా హీరో హీరోయిన్లుగా జంపా క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న చిత్రం అప్పుడలా ఇప్పుడిలా'. కె.ఆర్.విష్ణు దర్శకుడు. ప్రదీప్ కుమార్ జంపా నిర్మాత. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని సెప్టెంబర్ 12న నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా...

నిర్మాత ప్రదీప్ కుమార్ జంపా మాట్లాడుతూ 'మా బ్యానర్ కి మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది. డైరెక్టర్ విష్ణు ప్రతి సన్నివేశాన్ని బాగా డిజైన్ చేశారు. బ్రహ్మారెడ్డిగారు మంచి కథను అందించారు. ఇటీవల విడదల చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సునీల్ కశ్యప్ గారు అందించిన మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తాయి. సెప్టెంబర్ 12న సినిమా ఆడియో కార్యక్రమాన్ని సినీ ప్రముఖుల సమక్షంలో నిర్వహిస్తున్నాం. అలాగే త్వరలోనే సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అన్నారు.

దర్శకుడు కె.ఆర్.విష్ణు మాట్లాడుతూ 'ఈ సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చిన ప్రదీప్ గారికి థాంక్స్. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 12న పాటలను విడుదల చేస్తున్నాం. సుమన్, నరేష్, సూర్యతేజ, హర్షికి సహా ప్రతి ఒక ఆర్టిస్ట్, టెక్నిషియన్ బాగా సపోర్ట్ చేశారు, అందరికీ థాంక్స్'' అన్నారు.

సుమన్, నరేష్, సుధ, సంగీత, శివారెడ్డి, పృథ్వీ, సుప్రీత్, ప్రభాష్ శ్రీను, వేణు, సుడిగాలి సుధీర్, ఫిష్ వెంకట్, జోష్ రవి, అనంత్ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి డ్యాన్స్: రాకేష్, శేఖర్, భాను,కథ: బ్రహ్మారెడ్డి కమతం, మాటలు: పానుగంటి జయంత్, పాటలు: చిర్రావూరి విజయ్ కుమార్, చైతన్యవర్మ, ఆర్ట్: గోవింద్, ఎడిటర్: ఎస్.బి.ఉద్ధవ్, సినిమాటోగ్రఫీ: పి.సి.ఖన్నా, సంగీతం: సునీల్ కశ్యఫ్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ : బిక్షపతి తుమ్మల, నిర్మాత: ప్రదీప్ కుమార్ జంపా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఆర్.విష్ణు.

More News

కత్తిరించేశారు

సినిమా మేకింగ్ లో లెంగ్త్ పెరగడం కామన్. అయితే ఈ లెంగ్త్ ను ఎడిటింగ్ రూమ్ లో ట్రిమ్ చేసేసి సినిమాని రిలీజ్ చేస్తుంటారు.

హ్యపీ బర్త్ డే టు మెగాస్టార్

కష్టపడితే మనిషి మహోన్నత స్థానానికి ఎదుతాడనే దానికి నిలువెత్తు నిదర్శనం మెగాస్టార్ చిరంజీవి. 1979లో ప్రాణం ఖరీదు చిత్రంతో కెరీర్ ను స్టార్ట్ చేసిన చిరు తన సినీ కెరీర్ లో అనేక ఎత్తు పల్లాలను

త్వరలో విడుదలకు సిద్ధమవుతోన్న 'కేటుగాడు'

‘ఉలవచారు బిర్యాని’ చిత్రంలో హీరోగా నటించి మెప్పించిన యంగ్ హీరో తేజస్ కంచర్ల హీరోగా ప్రముఖ రచయిత

సుధీర్ మంచి రోజులు

సుధీర్ బాబు, వామికా గబ్బీ జంటగా నటిస్తున్న సినిమా `భలే మంచి రోజు`.

పవన్ పోరాటం చేస్తాడా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాని వ్యతిరేకంగా పోరాటం చేస్తాడా..ఏమో పరిస్థితులు చూస్తుంటే అలాగే కనపడుతున్నాయి.