Universities:తెలంగాణలో యూనివర్సిటీలకు ఇంఛార్జ్‌ వీసీల నియామకం

  • IndiaGlitz, [Tuesday,May 21 2024]

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు ఇంఛార్జ్ వీసీలను నియమించింది. సీనియర్ ఐఏఎస్ అధికారులకు ఇంఛార్జ్ వీసీలుగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇంఛార్జ్ వీసీల జాబితా ఇదే..

ఉస్మానియా వర్సిటీ ఇంఛార్జ్‌ వీసీగా దాన కిషోర్
జేఎన్‌టీయూ ఇంఛార్జ్ వీసీగా బుర్ర వెంకటేశం
తెలుగు వర్సిటీ ఇంఛార్జ్ వీసీగా శైలజారామయ్యర్
అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ ఇంఛార్జ్ వీసీగా రిజ్వి
కాకతీయ వర్సిటీ ఇంఛార్జ్ వీసీగా వాకాటి కరుణ
తెలంగాణ వర్సిటీ ఇంఛార్జ్ వీసీగా సందీప్ సుల్తానియా
మహాత్మాగాంధీ వర్సిటీ ఇంఛార్జ్ వీసీగా నవీన్‌మిట్టల్
శాతవాహన వర్సిటీ ఇంఛార్జ్‌ వీసీగా సురేంద్రమోహన్
జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ వర్సిటీ ఇంఛార్జ్‌ వీసీగా జయేష్‌ రంజన్
పాలమూరు వర్సిటీ ఇంఛార్జ్‌ వీసీగా నదీమ్‌ అహ్మద్

కాగా ఈ 10 యూనివర్సిటీల వీసీల పదవీకాలం ఇవాళ్టితో ముగియడంతో ప్రభుత్వంలో వివిధ శాఖాధిపతులుగా పనిచేస్తున్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులకు తాత్కాలిక బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే కొత్త వీసీల కోసం అన్ని వర్శిటీలలో సెర్చ్‌ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ జాబితాలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం వీసీలను నియమించనుంది. అప్పటివరకు సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇంఛార్జ్ వీసీలుగా బాధ్యతల్లో కొనసాగనున్నారు.

More News

Rakshana:‘రక్షణ’ టీజర్.. థియేటర్స్ సంద‌డి చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతోన్న సీట్ ఎడ్జ్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్ల‌ర్‌

‘‘వాడెవ‌డో తెలియ‌దు.. కానీ ఎలాంటి వాడో తెలుసు. .

L2 Empuraan:లైకా ప్రొడక్ష‌న్ భారీ చిత్రం ‘L2 ఎంపురాన్’:  ఖురేషి అబ్ర‌మ్‌ పాత్ర‌లో అద‌ర‌గొట్టే లుక్‌తో మోహ‌న్ లాల్‌

స్టార్ హీరోల‌తో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థ‌గా లైకా ప్రొడ‌క్ష‌న్స్‌కి ఓ పేరుంది.

Revanth Cabinet: త్వరలో తెలంగాణ కేబినెట్ విస్తరణ.. రేవంత్ జట్టులోకి వచ్చేదెవరు.?

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. దీంతో కేబినెట్ విస్తరణ గురించి జోరుగా చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు తమ మంతనాలు మొదలెట్టారు.

Kumaraswamy: తప్పు చేయకపోతే భారత్‌కు తిరిగి వచ్చేయ్.. ప్రజ్వల్‌కు కుమారస్వామి విజ్ఞప్తి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కీలక సూచన చేశారు.

Janasena: ఈసారి జనసేన ముద్ర బలంగా ఉంటుందంట.. ఎన్ని స్థానాల్లో గెలుస్తుందంటే..?

జనసేన పార్టీ పెట్టి 10 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రాధాన్యత లేకుండా పోయింది. కనీసం ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ కూడా ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టలేకపోయారు.