Mogalirekulu Sagar:జనసేన ప్రచార కార్యదర్శిగా 'మొగలిరేకులు' సాగర్ నియామకం
Send us your feedback to audioarticles@vaarta.com
ఇటీవల జనసేన పార్టీలో చేరిన 'మొగలిరేకులు' సీరియల్ ఫేమ్ ములుకుంట్ల సాగర్ అలియాస్ ఆర్కే నాయుడుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించారు. తెలంగాణలో జనసేన పార్టీ ప్రచార కార్యదర్శిగా సాగర్‌ను నియమించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సాగర్‌కు నియామక పత్రాన్ని జనసేనాని అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో జనసేన-బీజేపీ కూటమి సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. కూటమి అభ్యర్థుల విజయం కోసం కృషి చేయాలని శానిర్దేశం చేశారు. పార్టీ ప్రచార కార్యదర్శిగా బాధ్యతలు సమర్థంగా నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు.
ఇక ఎన్నికల్లో పోటీ చేస్తున్న 8 మంది అభ్యర్థులకు పార్టీ తరపున పవన్ కల్యాణ్ బీఫారం అందించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. బలి దానాలతో సాకారమైన తెలంగాణను బంగారం చేసుకోవాలన్నారు.హోమ్ రూల్ ఉండాలనే ఉద్దేశంతో దశాబ్దకాలం పోటీకి దూరంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ యువత ఆకాంక్షలు నెరవేరాల్సి ఉందన్నారు. తెలంగాణ సాయుధ నపోరాట స్ఫూర్తి జనసేన పార్టీని ముందుకు నడిపించేలా చేస్తోందన్నారు. ఏపీలో అభివృద్ధి జరిగి వలసలు ఆగితేనే తెలంగాణ ఆకాంక్షలు సంపూర్ణం అవుతాయని చెప్పారు. లేదంటే ఇక్కడికి వలసలు పెరిగి ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయన్నారు. అందుకే తాను ఏపీపై ప్రత్యేక దృష్టి సారించానని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి ఆశయ సాధన కోసం జనసేన కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
గ్రేటర్ హైదరబాద్‌లోని కూకట్‌పల్లి నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, తాండూరు నుంచి నేమూరి శంకర్ గౌడ్, కోదాడ నుంచి మేకల సతీష్ రెడ్డి, నాగర్ కర్నూలు అభ్యర్థిగా వంగా లక్ష్మణ్ గౌడ్, ఖమ్మం అభ్యర్థిగా మిర్యాల రామక్రిష్ణ, కొత్తగూడెం అభ్యర్థిగా లక్కినేని సురేందర్ రావు, వైరా(ఎస్టీ) నుంచి డాక్టర్ తేజావత్ సంపత్ నాయక్, అశ్వారావుపేట (ఎస్టీ) అభ్యర్థిగా ముయబోయిన ఉమాదేవి పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా ఏపీ సెటిలర్ల ఓటర్లు ఉండటం గమానార్హం.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout