Vote Apply:అక్టోబర్ 31 వరకు ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చు.. అభ్యర్థులు, ప్రజలకు తెలంగాణ సీఈవో సూచనలు

  • IndiaGlitz, [Monday,October 09 2023]

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్ అభ్యర్థులు, ప్రజలకు పలు సూచనలు చేశారు. నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని తెలిపారు. ప్రయాణాలు చేసేటప్పుడు పెద్ద మొత్తంలో నగదు ఉంటే అందుకు సంబంధించి పూర్తి పత్రాలు, వివరాలు ఉండాలని సూచించారు. అలాగే అభ్యర్థులు ప్రచారం సమయంలో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు లౌడ్ స్పీకర్లకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. సమస్యాత్మక, సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించే పనిలో ఉన్నామని పేర్కొన్నారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే టోల్‌ ఫ్రీ నెంబర్ 1950ని సంప్రదించాలన్నారు.

ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డులు వినియోగిచుకోవచ్చు..

అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్లో అన్ని కాలమ్స్ తప్పకుండా నింపాలని, లేదంటే తిరస్కరణకు గురవుతుందని హెచ్చరించా. నమూనా, మహిళలు, యువత కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డుకు ప్రత్యామ్నాయంగా 12 కార్డులు వినియోగిచుకోవచ్చని చెప్పారు. ప్రత్యేక ఓటర్లకు ప్రత్యేక సౌకర్యాలు, రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బ్రెయిలీ బ్యాలెట్ పత్రాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. బ్యాలెట్ పత్రాలపై పార్టీ గుర్తులతో పాటు అభ్యర్థుల ఫోటోలు కూడా ఉంటాయన్నారు. ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్లలో రాజకీయ నాయకుల ఫోటోలను తొలగించాల్సి ఉంటుందన్నారు. అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అయితే చిరునామా మార్పు అంశాలు మాత్రం వాయిదా వేస్తున్నట్లు వికాస్ రాజ్ వివరించారు.

More News

Telugu Comedian:దర్శకుడిగా మారబోతున్న మరో తెలుగు కమెడియన్‌

టాలీవుడ్‌లో మరో కమెడియన్ దర్శకుడుగా మారబోతున్నాడు. ఇప్పటికే పలు సినిమాలతో పాటు జబర్దస్త్‌ షో ద్వారా కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న వేణు..

CM KCR:నవంబర్ 9న గజ్వేల్, కామారెడ్డి స్థానాలకు సీఎం కేసీఆర్ నామినేషన్లు

తెలంగాణలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు ప్రచారాస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

CM Jagan:రాజకీయ కక్ష సాధింపుతో చంద్రబాబును అరెస్టు చేయలేదు.. సీఎం జగన్ క్లారిటీ

టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ కక్ష సాధింపుతో అరెస్టు చెయ్యలేదని.. ఆయనపై తనకు ఎలాంటి కక్ష లేదని సీఎం జగన్ తెలిపారు.

Chandrababu:చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ రేపటికి వాయిదా

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు కొట్టివేయాల్సిందిగా సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.

KTR:రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు.. నోటుకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపణలు

ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణలో రాకీయాలు హీటెక్కాయి. అధికార, ప్రతిపక్షాలు ఎత్తులు పైఎత్తులకు దిగాయి.